జార్ఖండ్, కశ్మీర్లకు బీజేపీ పరిశీలకులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు బీజేపీ పరిశీలకులను పంపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలను ఎన్నుకోనున్నారు. జమ్మూకశ్మీర్, జార్ఖండ్లకు ఇద్దరు చొప్పున పరిశీలకులను పంపాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది.
జమ్మూకశ్మీర్కు అరుణ్ జైట్లీ, అరుణ్ సింగ్.. జార్ఖండ్కు జేపీ నద్దా వినయ్ సమస్త్రబుధేలను పరిశీలకులుగా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ జార్ఖండ్లో మెజార్టీ సాధించగా, జమ్మూకశ్మీర్లో రెండో అతిపెద్ద పార్టీగా కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే.