![Cec Has Appointed Three Special Observers For Ap - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/28/Apmap.jpg.webp?itok=e5QCa_L8)
సాక్షి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి నీనా నిగమ్ నియమితులయ్యారు. వచ్చే వారం నుంచి ప్రత్యేక ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment