- ఐపీఎస్‌లలో అసహనం
- ‘డీపీసీ’ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా సీఎం పేషీలోనే ఫైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల పదోన్నతుల్లో జాప్యం వారిని అసహనానికి గురిచేస్తోంది. ఏటా జరిగే పదోన్నతుల ప్రక్రియలో డీజీపీ నుంచి వచ్చే ప్రతిపాధనలపై డిపార్ట్‌మెంటల్ ప్రమోషనల్ కమిటీ (డీపీసీ) సమీక్షించి ప్రభుత్వానికి పంపుతుంది. డీపీసీలో క్లియర్ అయిన అధికారుల పదోన్నతుల ఫైలుపై సీఎం సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలోనే డీపీసీ సమీక్షించి పదోన్నతులకు పచ్చజెండా ఊపినా కమిటీ పంపిన పదోన్నతుల ప్రతిపాదిత ఫైలు ఇప్పటివరకు సీఎం పేషీలోనే పెండింగ్‌లో ఉండిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పదోన్నతుల పైలుపై సీఎం సంతకం చేస్తే జీఏడీ సర్వీస్‌సెక్షన్ బి అధికారులు సంబంధిత అధికారులకు సీనియర్ టైమ్ స్కేల్ ఇస్తూ క్యాడర్ మార్పు జీవో విడుదల చేస్తారు. ఈ మాత్రం ప్రక్రియ కూడా జరగక పోవడంతో సంబంధిత అధికారుల్లో అస హనం పెరిగిపోయినట్టు చర్చ జరుగుతోంది. పదోన్నతులకు డీపీసీ లైన్ క్లియర్ చేయ డంతో పోస్టింగులే తరువాయి అనుకున్న సమయంలో పదోన్నతుల ఫైలుకే మోక్షం లేకపోవడంతో పోస్టింగులు ఎప్పుడవుతాయో తెలియక ఐపీఎస్‌లు ఆందోళనలోపడ్డా రు. పదోన్నతులు పూర్తయితే అదనపు భారంతో ఇబ్బందులు పడుతున్న అధికా రులను పలు విభాగాలకు హెచ్‌ఓడీలుగా నియమించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పదోన్నతులు, పోస్టింగుల ఫైళ్లు ముందుకు పోకవడంతో ఇటు విభాగాల్లో, అటు అధికారుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది.