
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కొత్త రెస్టారెంట్ ప్రారంభించింది.

కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ రెస్టారెంట్ బిజినెస్ గురించి వెల్లడించింది.

తన చిన్ననాటి స్నేహితుడు మలయ నాగ్‌పాల్, రెస్టారెంట్ నడిపే ధవల్ ఉదేషితో కలిసి ఈ ఫుడ్ బిజినెస్‌లో దిగింది.

ముంబైలోని బాంద్రాలో కొలువుదీరిన ఈ రెస్టారెంట్‌కు స్కార్‌లెట్ హౌస్ అని నామకరణం చేశారు.

90 ఏళ్ల క్రితం నాటి పోర్చుగీస్ ఇంటికి వింటేజ్ లుక్ తీసుకొచ్చి రెస్టారెంట్‌గా మార్చేశారు.

ఈ న్యూస్ వినగానే అభిమానులు, సెలబ్రిటీలు మలైకా అరోరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అక్కడికి వచ్చి భోజనం రుచి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

మలైకా సోదరి అమృత అరోరా.. నా డార్లింగ్ సిస్టర్.. మొత్తానికి నీ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను అమల్లో పెట్టేశావు అంటూ ప్రశంసలు కురిపించింది.

తన కుమారుడితో కలిసి రెస్టారెంట్‌ను ప్రమోట్ చేయడానికి గల కారణాన్ని మలైకా చెప్తూ.. మా ఇద్దరికీ భోజనం అంటే ఇష్టం.

ఎక్కడికి వెళ్లినా ఫుడ్ ఆస్వాదిస్తాం. విదేశీ టూర్‌లో ఏదైనా వంటకం నచ్చిందంటే కచ్చితంగా దాన్ని ఇంట్లో ట్రై చేస్తాం..

కాబట్టి రెస్టారెంట్ ప్రారంభించడమనేది నా మనసుకు నచ్చిన పని చేస్తున్నట్లుగా ఉంది అని పేర్కొంది.
