హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, కోశాధికారిగా ఎస్ అజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా ఎం. రమేష్ నియమితులయ్యారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 25 మంది ఐపీఎస్ అధికారులు సమావేశమై, నూతన కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా స్వాతిలక్రా, శివప్రసాద్, అకున్‌సభర్వాల్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ తొలి సమావేశంలో ఐపీఎస్‌లు అందరూ గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని నిర్ణయించారు. ఇది వరకే జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ గ్యాస్ సబ్సిడీని వదులుకోగా, తాజాగా మిగతా ఐపీఎస్ అధికారులు అందరూ వదులుకోనున్నారు.