సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగానాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ల వరుణ్ రెడ్డిలు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు.
కాగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందాయి. అధికారులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి. అంతేగాక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేవంలో పలువురు అధికారుల పనితీరుపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికారుల పనితీరు, సంబంధిత ఇన్‌పుట్‌లను అంచనా వేసిన తర్వాత సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం అయిదు గంటల వరకు ప్యానెల్ లిస్ట్ పంపాలని ఎన్నికల కమిషన్ తెలంగాణ సీఎస్‌ను ఆదేశించింది.
తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ర్పరాజ్ అహ్మద్ , కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవిని కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సమయంలో పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment