జమ్ము కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్‌ విడుదల | EC Released Four States Assembly Elections Schedule | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్‌ విడుదల

Published Fri, Aug 16 2024 3:37 PM | Last Updated on Fri, Aug 16 2024 7:01 PM

EC Released Four States Assembly Elections Schedule

సాక్షి, ఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హర్యానా, జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు.  

ఆర్టికల్‌-370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్‌లో తొలిసారి అసెం‍బ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 110 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో పోలింగ్‌ జరగనుంది.  

  • సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ ఒకటో తేదీన మూడు విడతల్లో జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.

👉ఒకటో విడత సెప్టెంబర్ 18(24 స్థానాలు)

👉రెండో విడత సెప్టెంబర్ 25(26 స్థానాలు)

👉మూడో విడత అక్టోబర్ 1(40స్థానాలు)

  • అక్టోబర్‌ నాలుగో తేదీన జమ్ము కశ్మీర్‌ ఎన్నికల కౌంటింగ్‌.

ఇక హర్యానాలో ఒకే విడతలతో ఎన్నికలు జరగనున్నట్లు  సీఈసీ ప్రకటించారు.  

  • హర్యానాలో 90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు. 

  • అక్టోబర్‌ ఒకటో తేదీన ఎన్నికలు, నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్‌

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement