
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం(జులై1) బదిలీ చేసింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా మహేష్ బాబాసాహెబ్
గవర్నర్ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయలను ప్రభుత్వం నియమించింది.