
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా విజిలెన్స్ డీజీగా హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్ నియమితులయ్యారు.
బదిలీల ప్రకారం..
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
ఏసీబీ డీజీగా విజయ్ కుమార్
విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్‌కు అదనపు బాధ్యతలు.
పోలీస్ పర్సనల్ ఏడీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు.