సాక్షి, విజయవాడ: ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు రాసిన అబద్ధపు రాతలపై సీఎస్ ఖండన లేఖను విడుదల చేశారు. తన ఖండన ఈనాడు మొదటి పేజీలో ప్రచురించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారంటూ సీఎస్ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారులు ఏసీఆర్‌లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చిందని సీఎస్ పేర్కొన్నారు.
ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్‌పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది. అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి. అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం. ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు. అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు. తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి. లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా’’ అని సీఎస్ జవహర్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్‌ల సంఘం ఆగ్రహం
పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్‌ల సంఘం మండిపడింది. ఈ ముగ్గురిపై క్రిమినల్ చర్యలకు దిగాలని నిర్ణయించింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించమని ఐపీఎస్‌ల సంఘం తేల్చి చెప్పింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈసీకి పురేందశ్వరి ఫిర్యాదు చేయడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఐపీఎస్ అధికారుల సంఘం వెల్లడించింది.
ఇదీ చదవండి: ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా చంద్రబాబూ..
Comments
Please login to add a commentAdd a comment