
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ నెల 5వ తేదీన 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో 15 రోజుల వ్యవధిలో రెండు దశల్లో రాష్ట్రంలో 47 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. అప్పట్లో బదిలీ చేసిన వారిలో ఐదుగురు మరోసారి బదిలీ అయ్యారు.
టీడీపీ హయాంలో ప్రత్యేకంగా డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ను అనంతపురం పీటీసీకి బదిలీ చేయగా తాజాగా ఆయన్ను పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోయ ప్రవీణ్, జీవీజీ అశోక్‌కుమార్, సర్వశ్రేష్ట త్రిపాఠి, విక్రాంత్ పాటిల్‌పై ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment