నేడు విద్యాసంస్థల బంద్
Published Thu, Sep 8 2016 12:40 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈనెల 8వ తేదీన విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌తో పాటు కలెక్టరేట్, ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు పెంచడంతో పాటు రూ. 3100 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement