కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలకు ఆరాధ్యదైవమని, ఆ మహానీయుని ఆశయ సాధన కోసం పాటుపడాలని కరీంనగర్, ధర్మపురి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్,నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, డెప్యూటీమేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్,సాంఘిక సంక్షేమ శాఖ జేడీ నాగేశ్వర్‌రావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ అనాడే గ్రహించి రాష్ట్రాల విభజన సమయంలో అడ్డంకులు ఏర్పడకుండా ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి పూర్తి అధికారాలు ఇచ్చారని పేర్కొన్నారు.
అంబేద్కర్ భిక్ష వల్లే తెలంగాణరాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు. అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్లతో చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగాకొనసాగుతున్నామని అన్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించిన లక్ష్య సాధన కోసం ప్రజలు ముందుకు సాగాలని అన్నారు. కార్పొరేటర్లు, వివిధ దళిత, ఉద్యోగ సంఘాల నాయకులు కట్ల సతీష్,కంసాల శ్రీనివాస్,అంజన్‌కుమార్, బండారి వేణు, సత్యనారాయణరెడ్డి, అర్ష మల్లేశం, సునీల్‌రావు,కన్న కృష్ణ, కర్ర రాజశేఖర్, గంట కళ్యాణిశ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, మెండి చంద్రశేఖర్, కొరివి వేణుగోపాల్,కన్నం అంజయ్య, దళిత సంఘాల నాయకులు మేడి రాజవీరు, జానపట్ల స్వామి, వి.రాజమల్లయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి ఏర్పాట్లపై అధికారులు చిన్న చూపు చూస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ నాగేశ్వర్‌రావుతో దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు.
అంబేద్కర్ ఆశయసాధనకు పాటుపడుదాం
Published Sun, Dec 7 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement
Advertisement