'సీఎం, మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు' | TYSRCP leaders criticising cm kcr on farmer suicides issue | Sakshi
Sakshi News home page

'సీఎం, మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు'

Published Fri, Sep 11 2015 2:46 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

'సీఎం, మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు' - Sakshi

'సీఎం, మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు'

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, ఇతర మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ విమర్శించారు. హైదరాబాద్లో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో భయంకరమైన కరువు నెలకొందని పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణ వైఎస్ఆర్ సీపీ రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని టీవైఎస్ఆర్సీసీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement