TYSRCP
-
రుణమాఫీని తక్షణం పూర్తిగా అమలు చేయాలి
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయడం, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకంపై పార్టీ నేతలు చర్చించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీవైఎస్ఆర్ సీపీ జిల్లాల వారీ సమీక్షలు బుధవారం ముగిశాయి. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, ప్రజల సమస్యల గురించి చర్చించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని తక్షణం సంపూర్ణంగా అమలు చేయాలని కొండా రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ పేరుతో ప్రచారానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, నిధుల వ్యయం, పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. -
జులై 16 నుంచి టీ వైఎస్ఆర్ సీపీ జిల్లా సమీక్షా సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలు జులై 16 నుంచి ప్రారంభమవుతాయని టీవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డితో కలసి గట్టు శ్రీకాంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 16వ తేదీన నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 18వ తేదీన నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 19వ తేదీన గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల సమీక్షా సమావేశం ఉంటుందని వివరించారు. 20వ తేదీన మెదక్, ఖమ్మం జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వారు వివరించారు. -
'సీఎం, మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఇతర మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ విమర్శించారు. హైదరాబాద్‌లో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో భయంకరమైన కరువు నెలకొందని పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణ వైఎస్ఆర్ సీపీ రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని టీవైఎస్ఆర్సీసీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ తెలిపారు.