హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలు జులై 16 నుంచి ప్రారంభమవుతాయని టీవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డితో కలసి గట్టు శ్రీకాంత్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 16వ తేదీన నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే 18వ తేదీన నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 19వ తేదీన గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల సమీక్షా సమావేశం ఉంటుందని వివరించారు. 20వ తేదీన మెదక్, ఖమ్మం జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వారు వివరించారు.