ఆ బ్యాడ్‌న్యూస్‌ ఇదేనా? ప్రియాంకకు దూరంగా.. | Priyanka Jain Lover Shivakumar Going To USA, Visa Process Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Priyanka Jain: ప్రియాంకకు చెప్పాలనుకున్న బ్యాడ్‌ న్యూస్‌ ఇదేనా? అమెరికాకు షిఫ్ట్‌ అవుతున్న ప్రియుడు?

Published Sat, Jan 13 2024 7:18 PM | Last Updated on Sun, Jan 14 2024 6:46 AM

Priyanka Jain Lover Shivakumar Going to USA - Sakshi

సీరియల్‌ నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక జైన్‌. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైంది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఓసారి ప్రియుడు శివకుమార్‌ వచ్చినప్పుడు ఎమోషనలైంది నటి. పెళ్లి చేసుకుందాం.. ఇప్పుడే, ఇక్కడే! అంటూ అతడిని క్షణం కూడా వదల్లేకపోయింది. అటు శివకుమార్‌ నీకో గుడ్‌న్యూస్‌, బ్యాడ్‌న్యూస్‌ రెండూ చెప్తానన్నాడు. షో అయిపోయాక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ఆ శుభవార్తను బయటపెట్టాడు. తాజాగా అతడు అమెరికా షిఫ్ట్‌ కాబోతున్నానంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.

వీసా కోసం తిప్పలు
అతడు చెప్తానన్న బ్యాడ్‌ న్యూస్‌ ఇదేనా? ప్రియాంకను వదిలి దూరంగా వెళ్లిపోతున్నాడా? అని అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక తన యూట్యూబ్‌ వీడియోలో వీసా పొందడానికి ఢిల్లీ వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడో వివరించాడు. శివకుమార్‌ మాట్లాడుతూ.. యూఎస్‌ ఎంబసీ ముందు వీడియోలు తీస్తే ఫోన్‌లు లాగేసుకుంటారట. అందుకని అక్కడ వీడియో చేయలేకపోయాను. కానీ మొదటి ప్రయత్నంలోనే వీసా వచ్చేసింది. ప్రియాంక కాళ్లు మొక్కి మరీ వెళ్లాను. ప్రియాంకతో పాటు అమ్మ ఆశీర్వాదం వల్లే వీసా వచ్చింది. 20 సెకన్లలోనే ఇంటర్వ్యూ అయిపోయింది.

త్వరలోనే ఒక సర్‌ప్రైజ్‌
ఆమె న్యూయార్క్‌ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? అని అడిగింది. నేను తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. ఈ మధ్యే సీరియల్‌ అయిపోయింది. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నాను. ఈ సమయంలో న్యూయార్క్‌ వెళ్లి రావాలనుకుంటున్నాను అని చెప్పాను. వార్షిక జీతం, ఎవరెవరు వెళ్తున్నారని అడిగింది. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. చివరకు వీసా అప్రూవ్‌ అని చెప్పడంతో సంతోషమేసింది. త్వరలోనే ఒక సర్‌ప్రైజ్‌ ఉండబోతుంది' అని చెప్పుకొచ్చాడు. అసలు శివకుమార్‌ అమెరికాకు వెకేషన్‌ వెళ్తున్నాడా? లేదంటే అక్కడే సెటిల్‌ అయ్యే ఆలోచనలున్నాయా? ఏంటనేది వీడియోలో స్పష్టంగా చెప్పలేదు.

చదవండి: భర్తకు నళిని విడాకులు.. ఆ తర్వాత కూడా నాన్న కొట్టేవాడన్న నటి కూతురు

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement