సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లి డి.కె.శివకుమార్‌ను కలిసిన ఫొటోను పోస్టు చేస్తూ ‘అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ. కానీ ఇప్పుడు వయా బెంగళూరు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీల్లో మోకరిల్లడం’ అని కవిత ట్విట్టర్‌లో జత చేశారు. ఇందుకు స్పందించిన రేవంత్ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ దండం పెడుతున్న ఫొటోతో రీట్వీట్ చేశారు. ‘గల్లీల్లో సవాళ్లు.. ఢిల్లీలో వంగివంగి మోకరిల్లి వేడుకోళ్లు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు, జగమెరిగిన నిక్కర్ లిక్కర్ లాజిక్కు’ అని పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment