సరికొత్త టాలీవుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. క్రేజీ సాంగ్ రిలీజ్! | Tollywood Actor Raja Ravindra Latest Movie Lyrical Song Release | Sakshi
Sakshi News home page

Sarangadhariya Movie: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'సారంగదరియా'.. సాంగ్ రిలీజ్!

Published Fri, Apr 5 2024 6:29 PM | Last Updated on Fri, Apr 5 2024 7:39 PM

Tollywood Actor Raja Ravindra Latest Movie Lyrical Song Release - Sakshi

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సారంగదరియా’. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘అందుకోవా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ..  'మా ‘సారంగదరియా’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు. లెజెండరీ సింగర్ చిత్ర మా పాటను పాడటం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం' అని అన్నారు.  
 
డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా మూవీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి అందుకోవా అనే పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎబెనెజర్ పాల్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement