
చెన్నై: తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సెలబ్రెటీస్ పంచుకుంటారు. లెజండరీ నటుడు శివాజీ గణేషన్ మనువడు శివకుమార్.. తనకు కుమారుడు జన్మించాడని ట్విటర్ వేదికగా తెలిపాడు. ఆయనకు ప్రముఖ హీరోయిన్ సుజావరుణీలకు గత సంవత్సరం వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
శివకుమార్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. కుమారుడు జన్మించడం చాలా ఆనందంగా ఉందని, తమ సింబా వచ్చాడని త్వరలో మీముందుకు రాబోతున్నాడంటూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఆగస్టు 21 అనేది జీవితంలో మరిచిపోలేని రోజు అని అన్నారు. శివాజీ గణేషన్ మనవడిగా శివకుమార్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. అంతగా సక్సెస్‌కాలేకపోయారు. ఇక సుజా విషయానికి వస్తే.. కన్నడ, తెలుగు, మలయాల చిత్రాలలో నటించింది. తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment