Suja Varunee
-
మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో
చెన్నై: తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సెలబ్రెటీస్ పంచుకుంటారు. లెజండరీ నటుడు శివాజీ గణేషన్ మనువడు శివకుమార్.. తనకు కుమారుడు జన్మించాడని ట్విటర్ వేదికగా తెలిపాడు. ఆయనకు ప్రముఖ హీరోయిన్ సుజావరుణీలకు గత సంవత్సరం వివాహం జరిగిన సంగతి తెలిసిందే. శివకుమార్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. కుమారుడు జన్మించడం చాలా ఆనందంగా ఉందని, తమ సింబా వచ్చాడని త్వరలో మీముందుకు రాబోతున్నాడంటూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఆగస్టు 21 అనేది జీవితంలో మరిచిపోలేని రోజు అని అన్నారు. శివాజీ గణేషన్ మనవడిగా శివకుమార్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. అంతగా సక్సెస్‌కాలేకపోయారు. ఇక సుజా విషయానికి వస్తే.. కన్నడ, తెలుగు, మలయాల చిత్రాలలో నటించింది. తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వెలుగులోకి వచ్చింది. -
వచ్చేనెలలో పెళ్లి చేసుకోబోతున్న నటి
సాక్షి, తమిళ సినిమా : వచ్చేనెల నవంబర్‌లో పెళ్లికి రెడీ అవుతోంది నటి సుజావరూణి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. కోలీవుడ్‌లో మిలగా చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. గత ఏడాది బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని మరింత పేరు తెచ్చుకుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన చిత్రం ఇరవుక్కు ఆయిరం కన్గళ్.. ఆమె నటించిన మరో సినిమా వాడీల్ విడుదల కావాల్సి ఉంది. శివాజీగణేశన్ మనుమడు, రామ్‌కుమార్ కొడుకు అయిన శివాజీదేవ్, సుజావరూణి గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శివాజీదేవ్ కూడా హీరోగా పరిచయం అయినా, పెద్దగా రాణించలేకపోయాడు. వీరి మధ్య పరిచయం స్నేహంగానూ ఆపై ప్రేమగా మారిందనే తెలుస్తోంది. శివాజీదేవ్, సుజావరూణిలు సన్నిహితంగా ఉన్న ఫొటోలూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. అయితే మొదట్లో అలాంటి ప్రచారాన్ని నటి సుజావరూణి ఖండించింది. శివాజీదేవ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని పేర్కొంది. శివాజీదేవ్ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను నిరాకరించడంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యారు. నిశ్చితార్థం కూడా ఇటీవల జరిగిందట. నవంబర్ 19న వీరు పెళ్లి పీటలెక్కనున్నారన్నది తాజా సమాచారం. దీని గురించి నటి సుజావరూణి క్లారిటీ ఇచ్చింది. తనకు శివకుమార్ (శివాజీదేవ్ శివకుమార్ పేరుతో ఇటీవల నటిస్తున్నారు)కు నవంబర్‌లో వివాహం జరగనుందని తెలిపారు. శివకుమార్‌ను పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
టాప్‌లెస్‌గా నటించడానికి సై
సినీ పరిశ్రమలో అద్భుత నటన ప్రదర్శించినప్పటికీ మార్కెట్ డల్ కావడంతో ఇలియానా, రాధికా ఆప్టే, విద్యాబాలన్ వంటి భామలు అందాలను ఆరబోసి మార్కెట్‌ను తిరిగి పొందగలిగారు. వారిలో ముఖ్యంగా రాధికా ఆప్టే ‘పార్సెట్’ వంటి కొన్ని చిత్రాలలో టాప్‌లెస్‌గా నటించి కలకలం రేపుతోంది. ఈ విధంగా నటించడానికి కోలీవుడ్ నటీమణుల్లో ఎవరికైనా ధైర్యం ఉందా అని పరిశీలిస్తే నేనున్నానంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు ఓ బ్యూటీ విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్‌లెస్‌గా నటించడానికి సై అంటూ ముందుకు వచ్చింది. తమిళంలో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాల్లో నటించింది సుజా వరూణి. వీటిలో చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్ సాంగ్సే అధికం. దీంతో విరక్తి చెందిన సుజా ఇకపై ఐటమ్ సాంగ్స్‌కు చిందులు వేయబోనని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఈ విషయం గురించి అమ్మడు మాట్లాడుతూ.. తన కోసం వచ్చే దర్శకుల వద్ద ఓపెన్ హార్ట్‌గా కథలు వింటానన్నారు. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తానని తెలిపారు. అధికంగా రెమ్యునరేషన్ ఇస్తానని తెలిపినప్పటికీ ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించనని చెప్పారు. విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు నటించే హీరోయిన్ ఓరియంటెట్ చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. కథ ప్రాముఖ్యతను బట్టి టాప్‌లెస్‌గా కూడా నటించడానికి తాను సిద్ధమని, అంతటి ధైర్యం తనకు ఉందని తెలిపింది. అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉందని తెలిపింది. ఇరవుక్కు ఆయిరం కన్గల్, శత్రు, ఆన్దేవదై వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వరూణి వెల్లడించింది.