పిల్లలకు జ్వరమొస్తేనే తల్లడిల్లిపోతాం.. నిమిషానికోసారి చేయి పట్టుకుని చూస్తాం.. డాక్టర్, మందులు అంటూ హడావుడి చేస్తాం.. తిరిగి వారు కోలుకునే వరకు నిద్రపోకుండా సపర్యలు చేస్తాం.. అలాంటిది క్యాన్సర్‌తో బాధ పడుతున్న కన్న బిడ్డ ‘నాన్నా.. నన్ను బతికించు ప్లీజ్.. నేను స్కూల్‌కెళ్లి ఎన్ని నెలలైందో.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది.. నీతో మాట్లాడాలని ఉంది..’ అంటూ కన్నీటితో వేడుకున్నా ఆ తండ్రి గుండె కరగలేదు.