sai sri
-
చిన్నారి సాయిశ్రీకి కన్నీటి వీడ్కోలు
-
సాయిశ్రీకి కన్నీటి వీడ్కోలు
గాంధీనగర్ (విజయవాడ) : తండ్రి కర్కశత్వానికి, కబ్జాకోరుల దాష్టీకానికి బలైన చిన్నారి మాదంశెట్టి సాయిశ్రీ(13) అంతిమయాత్ర సోమవారం అశ్రునయనాల మధ్య సాగింది. ‘డాడీ... నన్ను బతికించు..’ అంటూ తండ్రిని వేడుకున్న సాయిశ్రీ సెల్ఫీ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో అందరినీ కలచివేసింది. ఆ చిన్నారని కడసారి చూసేందుకు మహిళలు తరలివచ్చారు. సాయిశ్రీ భౌతికకాయం వద్ద ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. దుర్గాపురంలోని సాయిశ్రీ ఇంటి నుంచి సాంబమూర్తిరోడ్డు వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ నుంచి వాహనంలో ఆమె భౌతికకాయాన్ని కృష్ణలంకలోని స్వర్గపురికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటి సమీపంలో సాయిశ్రీ భౌతికకాయం ఉంచి కొద్దిసేపు నిరసన తెలిపారు. సుమశ్రీకి బాసట... సాయిశ్రీ తల్లి సుమశ్రీని పలువురు నాయకులు పరామర్శించారు. ఆమెను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సాయిశ్రీకి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఫణిరాజు, ఐద్వా నాయకులు కె.శ్రీదేవి, డివైఎఫ్ఐ నాయకుడు మాధవ్ తదితరులు ఉన్నారు. బొండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చిన్నారి సాయిశ్రీ మృతికి పరోక్షంగా కారకుడైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయిశ్రీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుర్గాపురంలోని ఆమె ఇంటికి వెళ్లిన రాజకీయ, ప్రజా సంఘాలు, మహిళ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాయిశ్రీ తండ్రి శివకుమార్, ఆయనకు సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిని కబ్జా చేసి చిన్నారి మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగరంలో కబ్జాలు పెరిగిపోతున్నా, ఇక్కడే నివాసం ఉంటున్న సీఎం పట్టించుకోవడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 20 రోజులుగా ఎమ్మెల్యే బొండా ఎందుకు స్పందించలేదు ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులు నా ఇల్లు కబ్జా చేశారు. అందువల్లే ఇల్లు అమ్మలేకపోయాను. పాపకు వైద్యం చేయించలేకపోయాను. 20 రోజులుగా నా గోడు వెళ్లబోసుకున్నా ఎమ్మెల్యే ఉమా స్పందించలేదు. న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా? పాప చనిపోయాక ఎందుకు స్పందించారు. మాదంశెట్టి శివకుమార్ బెంగళూరులో ఉన్నారని ఎమ్మెల్యే ఎలా చెబుతారు? శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మాట్లాడడం సరికాదు. శవరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు ఉంటే నన్ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. నాకు జరిగిన అన్యాయంపై సీపీని కలుస్తా. బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి. – సుమశ్రీ, సాయిశ్రీ తల్లి -
వారిద్దరినీ విడిచిపెట్టొద్దు
- శివకుమార్, ఎమ్మెల్యే బొండాను శిక్షించాలని విపక్షాల డిమాండ్ - చిన్నారి సాయిశ్రీ మృతిపై వెల్లువెత్తిన సానుభూతి సాక్షి, అమరావతి బ్యూరో: చికిత్సకు నోచుకోక దయనీయ స్థితిలో విజయవాడలో ప్రాణాలు విడిచిన బాలిక సాయిశ్రీ ఉదంతం సభ్యసమాజాన్ని కలచివేసింది. అందుకు కారకులైన ఆమె తండ్రి మాదంశెట్టి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వెల్లువెత్తింది. సాయిశ్రీపై తండ్రి శివకుమార్ లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని తల్లి సుమశ్రీ కన్నీటి పర్యంతమవుతూ చెప్పడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. వైఎస్సార్ సీపీతోపాటు ఇతర ప్రతిపక్షా లు, ప్రజాసంఘాలు సుమశ్రీకి సంఘీభావం గా కదలివచ్చాయి. శివకుమార్, బొండా ఉమాపై చర్య తీసుకోవాలని డిమాండు చేస్తూ విజయవాడలో ర్యాలీ నిర్వహించాయి. అంతిమ యాత్రలో ఉద్రిక్తత: సాయిశ్రీ మృతదేహం అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దుర్గానగర్‌లోని నివాసం నుంచి ప్రజా సంఘాలు వెంట రాగా అంతిమయాత్ర బయలు దేరింది. మొగల్రాజపురంలోని ఎమ్మెల్యే బొండా ఉమా నివాసం సమీపంలో సాయిశ్రీ మృతదేహాన్ని ఉంచి డప్పులు మోగిస్తూ బాధితులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే నివాసం ఎదుట కూడా నిరసన తెలపాలని భావించగా పోలీసులు అడ్డుకున్నారు. స్వర్గపురి శ్మశానవాటిక వద్ద సాయిశ్రీకి దహన సంస్కారాలు నిర్వహించారు. సాయిశ్రీ మృతికి కారకులైన ఆమె తండ్రి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలని సుమశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతిపై హెచ్చార్సీ సీరియస్ నాంపల్లి : కన్నుమూసిన చిన్నారి సాయిశ్రీ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. -
వాళ్ల వేధింపులే సాయిశ్రీ మృతికి కారణం
విజయవాడ: చంద్రబాబు పాలనలో సంక్షేమ, ఆరోగ్య రక్ష వంటి పథకాలు అమలు కావడం లేదని, అందుకు నిదర్శనమే మాధవశెట్టి సాయిశ్రీ మృతి అని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సాయిశ్రీ మృతికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. టీడీపీ పాలనలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య రక్ష వంటి పథకాలు ప్రచారం చేసుకోవడమే తప్ప అమలు కావడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో చిన్నారి తనను బతికించమని వేడుకుంటే, స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలతో ఎటువంటి సాయం అందలేదన్నారు. ప్రపంచ విషయాలు తన డ్యాష్ బోర్డులో చూసే బాబుకు రాజధానిలోని చిన్నారి వేడుకోలు వినిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. టీడీపీ పాలనలో చిన్నారి రోదన అరణ్య రోదనైందనీ, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని బాబు తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
‘శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు’
విజయవాడ: శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమ అన్నారు. ఎమ్మెల్యేగా న్యాయం చేయాల్సిన బాధ్యత బోండా ఉమామహేశ్వరరావుకు లేదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 రోజులుగా తన గోడు చెబుతున్నా బోండా ఉమ స్పందించలేదని సుమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల వల్లే ఇల్లు అమ్ముకోలేక, తన బిడ్డను కోల్పోయానని సుమ భోరున విలపించారు. సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అన్నారు. మరోవైపు సుమను వైఎస్ఆర్ సీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ పరామర్శించారు. కాగా బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ నిన్న మధ్యాహ్నం ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. -
నాన్నా.. నన్ను బతికించవూ..
-
నాన్నా.. నన్ను బతికించవూ..
ఓ చిన్నారి ఆఖరి ఆర్తనాదం ► క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూసిన చిన్నారి ► వైద్యం చేయించడానికి అష్టకష్టాలు పడిన తల్లి ► వైద్య ఖర్చుల కోసం ఇల్లు అమ్ముతుంటే అడ్డుకున్న తండ్రి ► ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయుల దౌర్జన్యం ► మాతృ దినోత్సవం రోజున విజయవాడలో ఓ తల్లికి కడుపుకోత పిల్లలకు జ్వరమొస్తేనే తల్లడిల్లిపోతాం.. నిమిషానికోసారి చేయి పట్టుకుని చూస్తాం.. డాక్టర్, మందులు అంటూ హడావుడి చేస్తాం.. తిరిగి వారు కోలుకునే వరకు నిద్రపోకుండా సపర్యలు చేస్తాం.. అలాంటిది క్యాన్సర్‌తో బాధ పడుతున్న కన్న బిడ్డ ‘నాన్నా.. నన్ను బతికించు ప్లీజ్.. నేను స్కూల్కెళ్లి ఎన్ని నెలలైందో.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది.. నీతో మాట్లాడాలని ఉంది..’ అంటూ కన్నీటితో వేడుకున్నా ఆ తండ్రి గుండె కరగలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో తల్లీబిడ్డను వీధిన పడేశారు. చరమాంకంలో ఆ బిడ్డ తన తండ్రికి పంపిన వీడియోలోని ఒక్కో మాట వింటుంటే కళ్లెంట నీరు ఆగలేదు.. నేను ఎక్కువ రోజులు బతకనంట డాడీ.. ‘‘డాడీ.. నీ దగ్గర డబ్బుల్లేవంటున్నావ్.. కనీసం నా ఇల్లుందిగా.. ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో అయినా నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ.. ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంట డాడీ.. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు డాడీ.. నన్ను బ్రతికించు డాడీ.. నేను స్కూల్కెళ్లి ఎన్ని మంత్స్ అయిందో నీకు తెలుసు కదా డాడీ.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది.. దయచేసి నాకు ట్రీట్మెంట్ చేయిస్తే హ్యాపీగా నేను టెన్త్ క్లాస్ చదువుకుంటా.. స్కూలుకెళ్తా.. నా ప్రాణాలు కాపాడు డాడీ.. నీకు దండం పెడతా.. చేయి కూడా నొప్పిగా ఉంది డాడీ.. నీకు దండం పెడదామంటే చేయి వాచిపోయి నొప్పిగా ఉంది డాడీ.. కాళ్లు కూడా వాచి పోయాయి డాడీ.. కుంటుతూ నడుస్తున్నా డాడీ.. ఎప్పుడూ నన్ను మీ అమ్మతో పోలుస్తావుగా డాడీ.. వెంకట సుబ్బమ్మ అంటావుగా.. మీ మమ్మీకే డిసీజ్ వచ్చిందనుకుని నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ.. నాకు ఇపుడు ట్రీట్మెంట్ అవసరం అంట డాడీ.. నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంక బతకనంటా.. అమ్మ దగ్గర డబ్బుల్లేవు డాడీ.. నిజంగా అమ్మ దగ్గర డబ్బుల్లేవు.. ఒకవేళ నీ డబ్బులు ఏమైనా మా మమ్మి తింటుందనుకుంటే మాకెవ్వరికీ డబ్బులివ్వద్దు.. నువ్వే నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిం చు డాడీ.. నాకు అవసరమైనప్పుడల్లా ఆ డబ్బులు నువ్వే ఆస్పత్రిలో కట్టు డాడీ.. మమ్మీకి కూడా ఇవ్వద్దు.. నాకేమన్నా అయితే మీ నలుగురే దానికి బాధ్యత వహిస్తారు డాడీ.. మాదంశెట్టి శివకుమార్ నువ్వు నా తండ్రిగా, నీ కొడుకులు మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారాం కృష్ణ, నీ భార్య మాదంశెట్టి కృష్ణకుమారి.. మీరు నలుగురూ కలసి ఈ ఆస్తికి అడ్డు వస్తానని ఇన్‌డైరెక్టుగా నన్ను చంపేయాలనుకుంటున్నారు.. మీ చేతికి మట్టి అంటకుండా నా కొచ్చిన జబ్బుతోనే చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ.. దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్‌లో నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ.. ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ.. నేనే మాట్లాడుతా.. కనీసం నాతో మాట్లాడటానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ.. కొంచెమన్నా నా మీద జాలి చూపించు డాడీ.. నేను కూడా నీ కూతురునే కదా డాడీ.. ప్రేమ కాకపోయినా కనీసం జాలి అయినా చూపించు డాడీ.. ట్రీట్మెంట్ చేయించు డాడీ.. ప్లీజ్ డాడీ..’ సాక్షి, అమరావతి బ్యూరో: బిడ్డను బతికించుకోవాలన్న ఆ తల్లి వేదన అరణ్య రోదనే అయ్యింది. కుమార్తెకు వైద్యం చేయించేందుకు ఆమె పడిన ఆరాటం ఫలించలేదు. బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీ యులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ (13) ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. బొండా ఉమా వర్గీయుల రౌడీయిజానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన రాజధాని విజ యవాడలో కలకలం రేపింది. మాదంశెట్టి సుమశ్రీ తన కుమార్తె సాయిశ్రీతో కలసి విజయవాడ దుర్గానగర్‌లోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. సుమశ్రీ భర్త మాదంశెట్టి శివకుమార్ ఆ ఫ్లాట్‌ను కుమార్తె సాయిశ్రీ పేరిట రాశారు. సంరక్షకుడిగా తన పేరే పెట్టుకున్నారు. అయితే కొంత కాలంగా సుమశ్రీ, శివకుమార్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో సాయిశ్రీ క్యాన్సర్ బారిన పడింది. ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప ఫలితం ఉండదని వైద్యులు చెప్పారు. దీంతో తాము ఉంటున్న ఇంటిని విక్రయించి కుమార్తెకు వైద్యం చేయించాలని తల్లి సుమశ్రీ భావించారు. ఆ ఇల్లు మైనర్ అయిన కుమార్తె పేరిట ఉండటంతో సంరక్షకుడిగా ఉన్న తండ్రి శివకుమార్ సమ్మతించాల్సి ఉంది. ఇందు కు ఆయన అంగీకరించలేదు సరికదా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లీకూతుళ్లు తల్లడిల్లిపోయారు. ఎమ్మెల్యే బొండా వర్గీయుల బెదిరింపులు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గీయులు కొందరు ఇటీవల ఆ ఫ్లాట్‌కు వచ్చారు. ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పారంటూ ఆ ఇల్లు ఖాళీ చేయాలన్నారు. శివకుమార్ ఆ ఇంటిని తమకు అమ్మేశారని బెదిరించారు. దీనిపై సుమశ్రీ తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఉంటున్న ఫ్లాట్‌ను అమ్మేయడం ఏమిటి? కుమార్తె అనారోగ్య సమస్యల్లో ఉండగా ఈ దౌర్జన్యమేమిటి? అని ప్రశ్నించారు. ఇదేమీ పట్టించుకోని బొండా ఉమా వర్గీయులు మరింతగా చెలరేగిపోయారు. కుమార్తె సాయిశ్రీని తీసుకుని వైద్యం కోసం సుమశ్రీ హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఆ ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. సామాన్లను బయట పడేసి ఫ్లాట్‌ను ఆక్రమించుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సుమశ్రీని ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో ఓ రోజు రాత్రంతా ఆమె ఇంటిబయటే పడిగాపులు కాశా రు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వారం రోజుల్లో ఫ్లాట్ ఖాళీ చేయాలని హెచ్చరించి ఎమ్మెల్యే బొండా వర్గీయులు వెళ్లిపోయారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఆ ఇంటిని విక్రయించాలన్న సుమశ్రీ ప్రయత్నాలు ఫలించలేదు. అసలు శివకుమార్ ఉద్దేశపూర్వకంగా అందుబాటులో లేకుండాపోయారు. ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైనా ఎమ్మెల్యే ఏమాత్రం స్పందించ లేదు. దీంతో అంతా ఒక్కటై ఉద్దేశ పూర్వకంగా సుమశ్రీ, సాయిశ్రీలను వేధించారని స్పష్టమైంది. బొండా ఉమా బాధ్యత వహించాలి ‘నా బిడ్డ సాయిశ్రీ మృతికి మాదంశెట్టి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బాధ్యత వహించాలి. నా బిడ్డ ప్రాణాల మీదకు వచ్చినా వైద్య ఖర్చుల కోసం మా ఇంటిని అమ్ముకోనివ్వలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా అండతో ఓ రౌడీషీటర్ మమ్మల్ని బెదిరించారు. ఇంటిని అమ్మి బిడ్డ ప్రాణాలు కాపాడాలని నా భర్త మాదంశెట్టి శివకుమార్‌ను వేడుకున్నాను. ఇంటిని అమ్ముకోవడాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే బొండా ఉమాను పలుసార్లు ప్రాథేయపడ్డాను. వారు ఏమాత్రం కనికరించలేదు. పైగా వైద్యం చేయించకపోతే సాయిశ్రీ చనిపోతుందని, అప్పుడు ఇంటిని దక్కించుకోవచ్చని శివకుమార్ పథకం వేశాడు. అందుకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ శేషగిరిరావు, అతని కుమారుడు సహకరించారు. నా భర్త శివకుమార్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు స్నేహితుడు కావడంతో అతనికి అండగా నిలిచి దౌర్జన్యం చేశారు. దీంతో నా కూతురుకు సరైన వైద్యం చేయించలేకపోయాను. అనారోగ్యంతో తీవ్ర వేదన అనుభవిస్తూ నా కూతురు ప్రాణాలు విడిచింది. దీనికి ఎమ్మెల్యే బొండా ఉమా బాధ్యత వహించాలి. ఆయనకూ పిల్లలు ఉన్నారు. ఓ తల్లిగా నా ఆవేదనను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు.’ – సాయిశ్రీ తల్లి సుమశ్రీ ప్రాణాలు విడిచిన సాయిశ్రీ రోజురోజుకు సాయిశ్రీ ఆరోగ్యం క్షీణిం చింది. డబ్బులు లేక సుమశ్రీ తన కుమార్తెను మెరుగైన వైద్యం కోసం మళ్లీ హైదరాబాద్ తీసుకువెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి సాయిశ్రీ ఆదివారం మధ్యా హ్నం ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించింది. శివకుమార్‌కు సహకరించిన వారందరిని కఠినంగా శిక్షిస్తేనే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని కన్నీటిపర్యంతమైంది. సాయి శ్రీ చివరిసారిగా తన తండ్రికి పంపిన వీడియోను మీడియాకు చూపించింది. -
‘రక్షించండి నాన్న అని ఆఖరి సెల్ఫీ వీడియో’