సీరియల్ ద్వారా బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జైన్. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ ద్వారా జనాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన ఆటతో, మాటలతో టాప్ 5లో చోటు దక్కించుకుంది. త్వరలోనే తన ప్రియుడు, నటుడు శివకుమార్‌ను పెళ్లాడబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ సీరియల్ నటి ఆస్పత్రిపాలైంది. ఆమెకు ఆపరేషన్ జరిగిందంటూ శివకుమార్ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ఏడో తరగతిలో సైట్..
'ప్రియాంక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నేను కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. కళ్లు ఎర్రబడిపోయి, నొప్పితో విలవిల్లాడిపోయాను. లాసిక్ సర్జరీ చేశాక దాదాపు 8-10 గంటల పాటు కళ్లు తెరవలేము. ఇప్పుడు ప్రియాంక కూడా అదే సర్జరీ చేయించుకుంటోంది' అని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. 'నాకు ఏడో తరగతిలో సైట్ వచ్చింది. అప్పటినుంచే కళ్లద్దాలు పెట్టుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇవి ధరించడం వల్ల ఇరిటేషన్ వస్తోంది. అందుకే సర్జరీ చేయించుకుందామనుకుంటున్నాను' అని చెప్పింది.
కంటి ఆపరేషన్ సక్సెస్
తర్వాత తను ఆస్పత్రికి వెళ్లిన మొదటి రోజు నుంచి ఏమేం జరిగిందో వివరంగా వీడియోలో చూపించారు. శివకుమార్ ఆమె గురించి భయపడుతున్నా ప్రియాంక మాత్రం ఎంతో ధైర్యంగా సర్జరీకి ముందడుగు వేసింది. చివరకు ఆస్పత్రిలో తన కంటి ఆపరేషన్ ఎలా చేశారన్నది కూడా వీడియోలో క్లియర్‌గా చూపించారు. మొత్తానికి కొన్నేళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రియాంకకు ఎట్టకేలకు దాన్నుంచి విముక్తి లభించింది. ఈ సర్జరీ విజయవంతమైందని, ఇక కళ్లజోడుతో తనకు పని లేదని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక.
చదవండి: ఒకప్పుడు జేబు నిండా నోట్ల కట్టలు.. చివరకు కారు డిక్కీలో తెలుగు కమెడియన్ శవం
Comments
Please login to add a commentAdd a comment