'కేసీఆర్కు ఉప ఎన్నికల భయం పట్టుకుంది' | KCR afraid of by elections, says ysrcp leaders | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కు ఉప ఎన్నికల భయం పట్టుకుంది'

Published Tue, Nov 10 2015 5:31 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

KCR afraid of by elections, says ysrcp leaders

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఉప ఎన్నికల భయం పట్టుకుందని టీవైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ వ్యాఖ్యానించారు. నగరంలోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించి రూపొందించిన పాటల సీడిని ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement