30 మంది విద్యార్థినులపై రేప్‌ | repe on students.. happend in tamilnadu | Sakshi
Sakshi News home page

30 మంది విద్యార్థినులపై రేప్‌

Published Fri, Dec 16 2016 4:41 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

30 మంది విద్యార్థినులపై రేప్‌ - Sakshi

30 మంది విద్యార్థినులపై రేప్‌

తమిళనాడులో ట్యూషన్ సెంటర్‌ నిర్వాహకుల కీచకం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ట్యూషన్ విద్యార్థినులకు మత్తుమందిచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్న ముగ్గురు ట్యూషన్ సెంటర్‌ నిర్వాహకులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలక్కోడుకు చెందిన శివకుమార్‌ (25) తన స్నేహితులైన ఈశ్వరన్, శివలతో కలసి పాలక్కాడు, ధర్మపురిలో ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నడుస్తున్న ఈ సెంటర్లలో టెన్త్, ఇంటర్మీడియెట్‌కు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ట్యూషన్ కు వచ్చే అమ్మాయిలను స్పెషల్‌ క్లాసుల పేరుతో శివకుమార్‌ ఎక్కువసేపు ఉంచేవాడు.

ఆ సమయంలో టీ/ శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. వారు స్పృహకోల్పోగానే వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించి తర్వాత వారితో తన కోరిక తీర్చుకునేవాడు. ఆ దారుణాలనూ వీడియో తీసేవాడు. స్నేహితులు ఈశ్వరన్, శివలు సైతం వీడియోలను బయటపెడతామని బెది రించి, విద్యార్థినులను లొంగదీసుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థినులు వీరి దురాగతాలకు బలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement