Eeswaran
-
దీపావళి కానుకగా వన్‌గ్రామ్ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో
తమిళ హీరో శింబు ‘ఈశ్వరన్’ మూవీ టీంకు దీపావళికి కానుక వన్ గ్రామ్ గోల్డ్, ధుస్తులు ఇచ్చాడు. ప్రస్తుతం శింబు నటిస్తున్న ఈశ్వరన్ చిత్రం పూరైన సందర్భంగా షూటింగ్ చివరి రోజున పని చేసిన దాదాపు 400 మందికి వన్ గ్రామ్ గోల్డ్, కొత్త బట్టలను బహుమతిగా ఇచ్చాడు. అంతేగాక దాదాపు 200 మంది జునీయర్ ఆర్టిస్టులకు కూడా పండగ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేశాడు. దీంతో శింబు ఉదారతకు చిత్ర యూనిట్ సభ్యలతో పాటు జునీయర్ ఆర్టీస్టులంతా ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్క్షతలు తెలుపుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శింబు నాగుపామును పట్టుకుని ఉన్న ఫస్ట్ పోస్టుర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?) #ShootCompleted 😊#EeswaranTeaserForDiwali I heart fully thank each and everyone of my team #Eeswaran for this beautiful journey! & Special thanks to all my fans for all the love and support #SilambarasanTR #Atman #STR pic.twitter.com/7lAXOnjZyP — Silambarasan TR (@SilambarasanTR_) November 6, 2020 ఇక సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా శింబు ట్వీట్ చేస్తూ ఈ దీపావళి టీజర్ విడుద చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఈశ్వరన్ షూటింగ్ పూరైంది. ఈ దీపావళికి టీజర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వరన్ మూవీ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్క్షతలు తెలుపుతున్న’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
30 మంది విద్యార్థినులపై రేప్
తమిళనాడులో ట్యూషన్ సెంటర్ నిర్వాహకుల కీచకం సాక్షి ప్రతినిధి, చెన్నై: ట్యూషన్ విద్యార్థినులకు మత్తుమందిచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్న ముగ్గురు ట్యూషన్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలక్కోడుకు చెందిన శివకుమార్ (25) తన స్నేహితులైన ఈశ్వరన్, శివలతో కలసి పాలక్కాడు, ధర్మపురిలో ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నడుస్తున్న ఈ సెంటర్లలో టెన్త్, ఇంటర్మీడియెట్‌కు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ట్యూషన్ కు వచ్చే అమ్మాయిలను స్పెషల్ క్లాసుల పేరుతో శివకుమార్ ఎక్కువసేపు ఉంచేవాడు. ఆ సమయంలో టీ/ శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. వారు స్పృహకోల్పోగానే వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించి తర్వాత వారితో తన కోరిక తీర్చుకునేవాడు. ఆ దారుణాలనూ వీడియో తీసేవాడు. స్నేహితులు ఈశ్వరన్, శివలు సైతం వీడియోలను బయటపెడతామని బెది రించి, విద్యార్థినులను లొంగదీసుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థినులు వీరి దురాగతాలకు బలయ్యారు.