దీపావళి కానుకగా వన్‌గ్రామ్‌ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో | Hero Simbu Gifted One Gram Gold And Clothes To Eswaran Team This Diwali | Sakshi
Sakshi News home page

ఈశ్వరన్‌ టీంకు బట్టలు, గోల్డ్‌ ఇచ్చిన శింబు

Published Sat, Nov 7 2020 8:57 PM | Last Updated on Sat, Nov 7 2020 9:00 PM

Hero Simbu Gifted One Gram Gold And Clothes To Eswaran Team This Diwali - Sakshi

తమిళ హీరో శింబు ‘ఈశ్వరన్‌’ మూవీ టీంకు దీపావళికి కానుక వన్‌ గ్రామ్‌ గోల్డ్‌, ధుస్తులు ఇచ్చాడు. ప్రస్తుతం శింబు నటిస్తున్న ఈశ్వరన్‌ చిత్రం పూరైన సందర్భంగా షూటింగ్‌ చివరి రోజున పని చేసిన దాదాపు 400 మందికి వన్‌ గ్రామ్‌ గోల్డ్‌, కొత్త బట్టలను బహుమతిగా ఇచ్చాడు. అంతేగాక దాదాపు 200 మంది జునీయర్‌ ఆర్టిస్టులకు కూడా పండగ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేశాడు. దీంతో శింబు ఉదారతకు చిత్ర యూనిట్‌ సభ్యలతో పాటు జునీయర్‌ ఆర్టీస్టులంతా ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ‍్క్షతలు తెలుపుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శింబు నాగుపామును పట్టుకుని ఉన్న ఫస్ట్‌ పోస్టుర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?)

ఇక సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా శింబు ట్వీట్‌ చేస్తూ ఈ దీపావళి టీజర్‌ విడుద చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఈశ్వరన్‌ షూటింగ్‌ పూరైంది.  ఈ దీపావళికి టీజర్‌ విడుదల కానుంది. ఈ సందర్భంగా  ఈశ్వరన్‌ మూవీ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ‍్క్షతలు తెలుపుతున్న’ అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement