శివకుమార్ 7/30 | sivakumar 7/30 | Sakshi
Sakshi News home page

శివకుమార్ 7/30

Published Wed, Jan 14 2015 1:01 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

శివకుమార్ 7/30 - Sakshi

శివకుమార్ 7/30

త్రిపుర 151 ఆలౌట్

సాక్షి, ఒంగోలు: ఆంధ్ర బౌలర్ దువ్వారపు శివకుమార్ అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. త్రిపురతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 30 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌లో 47.5 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. పదో నంబర్ బ్యాట్స్‌మన్ రాణా దత్తా (64 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, రాకేశ్ సోలంకి (39 బంతుల్లో 37; 7 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించాడు.

అనంతరం ఆంధ్ర బ్యాటింగ్ కూడా తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ కైఫ్ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. శ్రీరామ్ (23), ప్రదీప్ (12), ప్రశాంత్ (4), భరత్ (0) వెనుదిరిగారు. ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 54 పరుగులు వెనుకబడి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement