సాక్షి, హైదరాబాద్: కోర్టు స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ పూర్వపు జాయింట్ కలెక్టర్ కె.శివకుమార్ నాయుడుకు 30 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అధికారులు అకారణంగా జైలుపాలు చేసినందుకు పిటిషనర్‌కు ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని హెకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఆదేశించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు ఉత్తర్వులను 3 వారాలపాటు నిలిపేస్తున్నట్లు చెప్పారు.
మహబూబ్‌నగర్‌లో బుచ్చయ్య అనే ప్రభుత్వ మాజీ ఉద్యోగికి చెందిన స్థలంలో కల్యాణ మంటపం నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి జేసీ పనులు చేయరాదని 2017 జూలై 1న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై బుచ్చయ్య హైకోర్టు నుంచి ఆగస్టు 29న స్టే ఉత్తర్వులు పొంది నిర్మాణ పనులు ప్రారంభించారు. సెప్టెంబర్‌లో జేసీ ఆదేశాల మేరకు పోలీసులు బుచ్చయ్యను అరెస్టు చేసి 2 నెలల 29 రోజులు జైల్లో పెట్టారు. కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించి తనను జైల్లో పెట్టారని బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పునిచ్చింది.
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
Published Sat, Aug 25 2018 1:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment