![Komatireddy Narsimha reddy as Teachers MLC Candidate - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/23/123.jpg.webp?itok=9CxUD9xe)
సాక్షి, హైదరాబాద్: నల్గొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి పోటీ చేయనున్నారు. పదేళ్ల పాటు నల్గొండ జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షుడిగా, సహా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం పీఆర్‌టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు పీఆర్‌టీయూ టీచర్లతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి పీఆర్‌టీయూ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీలో ఉంటారని ఇప్పటికే పీఆర్‌టీయూ ప్రకటించగా, ప్రస్తుతం నర్సింహారెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment