prtu leaders
-
తక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తక్షణమే చేపట్టాలని ప్రోగ్రెసివ్ రికగనైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూటీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మంత్రి కె.తారకరామారావును శుక్రవారం కలిసింది. 2015 నుంచి పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో పాఠశాలల్లో గుణాత్మక విద్యా బోధనకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపింది. రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ కొత్త పదం..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులది ఆకలి పోరాటం కాదని..ఆత్మగౌరవ పోరాటం అని పేర్కొన్నారు. అధికారం ఉందని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్కరూ మోసపోయారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు తమ వంతుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచి సమ్మెని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ప్రభుత్వ హత్యే.. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్యేనని న్యూ డెమోక్రసి నేత గోవర్ధన్ విమర్శించారు. 48 వేల ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీనివాసరెడ్డి బలిదానం అయ్యారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై మంత్రులు లేకుండా అధికారుల కమిటీ వేశారని ధ్వజమెత్తారు. కార్మికులు వేతనాల కోసం కాకుండా సంస్థ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం సీఎం వైఎస్ జగన్ అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. తెలంగాణలో ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ కొత్త పదం కనిపెట్టారన్నారు. తనను ప్రశ్నించారనే కారణంతో కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు నివ్వాలని కోరారు. టీఎన్జీవో, టీజీవో నేతలు ముఖ్యమంత్రి పెట్టిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రగతిభవన్‌కు గులాంగిరి చేయడానికి వెళ్ళారని విమర్శించారు. కేసీఆర్ హిట్లర్ తరహాలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి పార్థివదేహన్ని చూడనివ్వకుండా కార్మిక సంఘం నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలి వెంటనే ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ చైర్మన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. పలు తీర్మానాలు ప్రతిపాదిస్తూ ఉద్యోగ, రిటైర్డ్ సెల్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో ఉన్న పెన్షనర్స్ అందరూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపాలని మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. -
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై .. సర్వత్రా ఆసక్తి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘వరంగల్ – ఖమ్మం – నల్లగొండ’ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారుతోంది. తమ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు పీఆర్టీయూ దృష్టి పెట్టినా, ఆ సంఘంలో నెలకొన్న ఇంటిపోరు అతి పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో శాసనమండలి సభ్యుడిగా గెలిచిన పూల రవీందర్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన మరోమారు పోటీ చేయడం కోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే, అధికార టీఆర్ఎస్ ఇంకా బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. మరో వైపు అదే సంఘంలో ఈసారి పోటీకి తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వరంగల్‌కు చెందిన నరోత్తం రెడ్డి తాను పోటీలో ఉంటానని ప్రకటించడంతో పీఆర్టీయూలోని ఇంటిపోరు రచ్చకెక్కింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు గడ్డుపరిస్థితే ఎదురు కానుందని ఆ సంఘం ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయా ఉపాధ్యాయ సంఘాలు బరిఠి లోకి దిగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ దాకా నా మినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, శుక్రవారం యూటీఎఫ్ తరఫున ఆ సంఘ నాయకుడు నర్సి రెడ్డి నల్లగొండలో రెండు సెట్ల నామినేషన్లు దాఖ లు చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ స్థానానికి దాఖలైన నామినేషన్ల సంఖ్య ఐదుకు చేరింది. పోటా ... పోటీ ఎమ్మెల్సీ ఎన్నికపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు దృష్టి పెట్టాయి. 2013నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న పీఆర్టీయూ ఈసారి మాత్రం ఇంటి పోరుతో సతమతమవుతోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ గెలుపు ధీమాతో ఉంది. పీఆర్టీయూకు రెబెల్స్ బెడద ఉండడం తమకు కలిసొస్తుందన్న అంచనాలో ఆ సంఘ నాయకత్వం ఉంది. రాష్ట్ర నాయకుడు ఎ.నర్సిరెడ్డి నల్లగొండలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. మరో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ టీఎఫ్ కూడా పోటీలోకి దిగుతోంది. పీఆర్టీయూలో బుజ్జగింపుల పర్వం రెండో సారి కూడా బరిలోకి దిగుతున్న ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు యూనియన్‌లో కొంద రు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. ఆ యూనియన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆయనకు ముళ్లబాటగా మారాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన కోమటిరెడ్డి నర్సింహారెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఆయన కొద్ది రోజులు ప్రచారం కూడా చేశారు. ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఇబ్బందిగా మారడంతో అధికార టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని కోమటిరెడ్డి నర్సిరెడ్డిని దారికి తెచ్చుకున్నారని అంటున్నారు. జిల్లా నాయకత్వంతోపాటు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వంలోని ముఖ్యులు కొందరు నర్సింహారెడ్డిని బుజ్జగించారని చెబుతున్నారు. దీంతో పూల రవీందర్‌తో కలిసి ఆయన ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నల్లగొండ పరిస్థితిని చక్కదిద్ది కొంత అదుపులోకి తెచ్చుకున్నా.. వరంగల్‌కు చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి పోటీలో ఉంటున్నారని, ఆయన సొంతం జిల్లా వరంగల్‌లో ఓట్లు చీలడం ఖాయమని, ఈ పరిస్థితులు సిట్టింగ్ ఎమ్మెల్సీ గెలుపుపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. -
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్గొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి పోటీ చేయనున్నారు. పదేళ్ల పాటు నల్గొండ జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడిగా, సహా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు పీఆర్టీయూ టీచర్లతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి పీఆర్టీయూ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీలో ఉంటారని ఇప్పటికే పీఆర్టీయూ ప్రకటించగా, ప్రస్తుతం నర్సింహారెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్ : వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి పాత పద్ధతిలో (మాన్యువల్‌గా) బదిలీల కౌన్సెలింగ్ చే పట్టాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశా రు. జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదు ట పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, నల్ల రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు వెబ్ అప్షన్లు పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అలాగే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు అప్షన్లు ఇచ్చుకునేందుకు అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పం దించి మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీఈవోకు వినతపత్రం అందజేశారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇన్నారెడ్డి, మనోహర్, నిర్మల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణారావు, ఎ. నరేంద్రబాబు, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రకాశ్, నాయకులు రామకృష్ణ, సత్యనారాయణగౌడ్, అర్చన, అరుణ, మధుసూధన్, రాజన్న, జయరాం పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలని ధర్నా
ఇచ్చోడ : కేంద్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి వోపీసీ పునరుద్ధరించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లరత్నాకర్ రెడ్డి అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో, జీహెచ్ఎం, ఎస్ఎలను అఫ్గ్రెడ్ చేసిన పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు డైట్, జేఎల్ పోస్టులకు బదిలీలు చేపట్టి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులు ప్రకాశ్‌గౌడ్, జిల్లా బాధ్యులు జయరాం, అశోక్, దేవర్ల సంతోష్, రాజేశ్వర్, మండల అధ్యక్షులు కె ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి భగత్ కాశినాథ్, బుచ్చిబాబు, అన్వర్‌అలీ, రాష్ట్ర కార్యదర్శి మల్లెష్, సీపీఎస్ ఉపాధ్యాయులు రాజన్న, సిరికొండ మండల అధ్యక్షులు కాంతయ్య, కార్యదర్శి జైతు పాల్గొన్నారు. వెంటనే రద్దు చేయాలి... బోథ్: మండల తహసీల్ కార్యాలయం ఎదుట పీఆర్టీయూ నాయకులు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. వారి కుటుంబాలు రోడ్డునే పడే విధంగా ఈ విధానం ఉందని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందించారు. మండల అధ్యక్షులు భిక్కులాల్, ప్రధాన కార్యదర్శి జావిద్ అలీ, మండల పరిశీలకులు ఆర్టివి ప్రసాద్, రాజ్ నారాయణ, జిల్లా నాయకులు జయరాజ్, గంగయ్య,పోశెట్టి, సతీష్, అనిల్ పాల్గొన్నారు. గుడిహత్నూర్‌లో... గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్టీయూ మండలాధ్యక్షుడు సుభాష్ మోస్లే, ప్రధాన కార్యదర్శి మైస మాధవ్, అసోసియేట్ ప్రసిడెంట్ నాందేవ్, మహిళాధ్యక్షురాలు భూలత, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర అసోసియేట్ ప్రసిడెంట్ జాదవ్ సుదర్శన్, ఎంఈవో నారాయణ, సీనియర్ నాయకులు రాజేషుడు, వెంకటరమణ, నాగ్నాథ్, రమేష్ రెడ్డి, భీంరావ్, మోహన్, జరీనాబేగం, అర్చన, సీపీఎస్ ఉద్యోగులు శ్రీనివాస్ ఉన్నారు. పాత పింఛన్ విధానం తేవాలి... బజార్హత్నూర్ : పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రాజు, జిల్లా అసోషియేట్ సభ్యులు జయరాం, ప్రకాష్‌గౌడ్, రాష్ట్ర పరిశీలకుడు సంతోష్, మండల అధ్యక్షులు చంద్రకాంత్బాబు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, సభ్యులు లక్కం విజయ్‌శేఖర్, ఆర్.ప్రకాష్, సధానంధం, ఆర్ శంకర్, వెంకట రమణ, చందన్‌బాబు,మోహన్, శంకర్, జంగుబాబు పాల్గొన్నారు. రద్దు చేసే వరకు పోరాటం ... నేరడిగొండ : సీపీఎస్ విధానం రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి సహదేవ్ అన్నారు. తహసీల్దార్ కూనాల గంగాధర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నారాయణగౌడ్, జిల్లా కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యాయులు నారాయణ, మల్లేష్, రాంచందర్, అరుణ్, రాంచందర్, దేవిప్రియ, హారిక, సంగీత పాల్గొన్నారు. -
మళ్లీ త్రీఆర్స్
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 112 ప్రాథమికోన్నత పాఠశాలలు : 92 ప్రాథమిక పాఠశాలలు : 527 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు : 66,759 కసూర్తిబా పాఠశాలలు : 18 విద్యార్థినులు : 2,889 మామడ(నిర్మల్) : విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం భాషల్లో అనర్గళంగా చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు, రాత అంశాలను నేర్పించాలని ఈ విద్యాసంవత్సం జూలై, ఆగస్టులలో 2017లో త్రీఆర్స్(రీడింగ్, రైటింగ్, రీజనింగ్) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక, ఉన్నత, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని 60రోజుల పాటు నిర్వహించారు. విద్యార్థులు అన్ని అంశాల్లో కొంతవరకు ప్రగతి సాధించినప్పటికీ మరింత ప్రగతిని కనబర్చాల్సి ఉందని భావించారు. ఈ నెల 15నుంచి మార్చి చివరి వారం వరకు త్రీఆర్స్ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అమలు ఇలా.. విద్యార్థులను జట్లుగా చేసి చివరి మూడు పీరియడ్లలో తెలుగు, ఆం గ్లం, గణితం ఒక్కో సబ్బెక్ట్కు ఒక్కో పీరియడ్ కేటాయించారు. ప్రా థమిక పాఠశాలలో తెలుగులో సరళ పదాలు నేర్పించారు. గుణింతాలు, ఆంగ్ల పదాల వద్ద, గణితంలో తీసివేతలను విద్యార్థులకు మ రింత సులభతరంగా బోధించాలని మానిటరింగ్ బృందం సూచించింది. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం లో వాక్యాలు.. గణితంలో గుణాకారాలు, భాగహారాలను మళ్లీ నేర్పించాలని సూచించారు. ప్రతీ పది రోజులకోసారి తెలుగు, గణితం, ఆం గ్లం విషయాలలో సాధించాల్సిన లక్ష్యాలను పట్టిక రూపొందించుకోవాలని సూచించారు. త్రీఆర్స్ నిర్వహణను 60రోజులు పూర్తయినా ల క్ష్యం నెరవేరలేదని మళ్లీ అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. ఉన్నత పాఠశాలల్లో చేయాల్సినవి.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను గ్రూపుల వారీగా విభజించి ఏ స్థాయిలో ఉన్నారో చూడాలి. తెలుగు ఆంగ్ల భా షల్లో పేరాలు చదివి అర్థం చేసుకోవడం, సొంతంగా రాయడం, గణితంలో గుణకారం, భాగహారాలతో కూడిన రాత లెక్కలను చేయగలిగే లా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. మార్చి రెండో వా రంలోగా విద్యార్థులకు త్రీఆర్స్‌ను పూర్తి స్థాయిలో సాధించాల్సి ఉం టుంది. ప్రతీ పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిది వరకు పిల్లలంతా త్రీఆర్స్ చేయగలరని పాఠశాలల వారీగా ధ్రువీకరించాల్సి ఉంటుందని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లో.. ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు మార్చి చివరి వరకు త్రీఆర్స్‌ను పూర్తి చేయాలి. తెలుగులో ఎంతమంది విద్యార్థులు సరళ పదాలు, గుణింత పదాలు, ఒత్తు పదాలు, వాక్యాలు చదవడం రాయడం చేయగలరో గుర్తించాలి. గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, రాత లెక్కలు చేయగలరో గుర్తించాలి. ఆంగ్లంలో అక్షరాలు, పదాలు, వాక్యాలు, చదవడం, రాయడం చేయగలరో గుర్తించాలి. ఏ సబ్జెక్ట్లోనైన 80శాతం మంది విద్యార్థులు చేయగలిగితే మరో అంశాన్ని ప్రారంభించాలి. మార్చి చివరి వారంలో అంత్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. మానిటరింగ్ బృందం సందర్శన.. జనవరి 3నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర బృందం పాఠశాలలను సందర్శించింది. జిల్లాలోని 12 ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల రాష్ట్ర సగటు హాజరు 83శాతం కాగా, జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు 75 శాతం ఉంది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం రాష్ట్ర సగటు 84శాతం కాగా, జిల్లాలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయు ల హాజరు శాతం 87శాతం ఉందని మానిటరింగ్ బృందం నిర్ధారించింది. జిల్లాలోని మామడ మండలంలోని కొరిటికల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో త్రీఆర్స్ బాగా అమలైనట్లు అధికారులు ప్రశంసించారు. అమలు సాధ్యమయ్యేనా? మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలున్నాయి. పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. వీరు ఇన్విజిలేటర్లుగా వెళ్తే త్రీఆర్స్‌ను విద్యార్థులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఉన్నత పాఠశాలల్లో త్రీఆర్స్‌ను ముగించిన ఉపాధ్యాయులు ప్రస్తుతం సిలబస్‌పై దృష్టి పెట్టారు. త్రీఆర్స్పై దృష్టి పెట్టాలంటే సిలబస్ పూర్తి చేయడం కష్టంగా మారుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆదేశాలు జారీ అయ్యాయి పాఠశాలల్లో ఇప్పటికే త్రీఆర్స్ అంశాలను అమలు చేశారు. మానిటరింగ్Š బృందాల పరిశీలనలో పూర్తిస్థాయిలో ప్రాథమిక అంశాలు అమలు కాలేదని త్రీ ఆర్స్‌ను నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫి బ్రవరి 15నుంచి మార్చి వరకు ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు. – వెంకటరమణారెడ్డి, సెక్టోరల్ అధికారి, నిర్మల్ పరీక్షలపుడు సాధ్యం కాదు పరీక్షల సమయంలో త్రీఆర్స్‌ను నిర్వహించడం సా« ద్యం కాదు. అధికారులు గుర్తించి రెండో విడతలో అ మలు చేయనున్న త్రీఆర్స్‌ను విరమించుకోవాలి. ప దో తరగతి పరీక్షలుండడంతో పాటు విద్యాసంవత్స రం ముగుస్తున్నందున సిలబస్‌పై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తారు. వీటిని అధిగమించి త్రీఆర్స్‌ను నిర్వహించడం సాధ్యం కాదు. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఉపాధ్యాయ సమస్యలపై పోరుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సహించేది లేదని పీఆర్టీయూ–టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు అవసరమైతే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ జరిగిన పీఆర్టీయూ 32వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు , నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉపసంహరణ, ఉన్నత పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయించడం, పూర్తిస్థాయిలో హెల్త్‌కార్డుల అమలుకు కృషి చేయడం పీఆర్టీయూ ప్రాధాన్యాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సర్వీసు రూల్స్ రూపొందించి, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేసింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని పేర్కొంది. 11వ పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, 2018 జూలై 1 నుంచి అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది. ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసింది. సమావేశంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ అధ్యక్షుడిగా సరోత్తంరెడ్డి పీఆర్టీయూ నూతన అధ్యక్షుడిగా పులి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెన్నకేశవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పీఆర్టీయూ రాష్ట కౌన్సిల్ సమావేశం అనంతరం నూతన కార్యవర్గం ఎన్నికకు నామినేషన్ స్వీకరించారు. ముందస్తు నిర్ణయం మేరకు ప్రస్తుత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న వారిద్దరూ మరో రెండేళ్లపాటు కొనసాగే నూతన కార్యవర్గం కోసం నామినేషన్ వేశారు. మిగతా వారెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం జరిగే సమావేశంలో వారు ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు తమ కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు. -
నూతన పెన్షన్ విధానం రద్దుకు డిమాండ్
ఏలూరు అర్బన్ : నూతన పెన్షన్ విధానంతో ఉపాధ్యాయులకు రక్షణ కరువైందని, దీనిని వెంటనే రద్దుచేయాలని ఏపీ పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట బుధవారం జిల్లాస్థాయి ధర్నా నిర్వహించారు. జిల్లా యూనియన్ గౌరవాధ్యక్షుడు ఏవీ కాంతారావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ.. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.రాధ మాట్లాడుతూ.. అంతర్గత మూల్యాంకనంలో మార్పులు తీసుకోవాలని కోరారు. జేఏసీ నాయకులు హరినాథ్, శ్రీనివాస్, శ్రీధర్‌రాజు సంఘీభావం తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు పి.బాబ్జీ, డి.దావీదు, బి.రాము, బి.త్రినాథ్ పాల్గొన్నారు. అనంతరం జేసీ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు.