
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నిధుల గోల్‌మాల్‌పై సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.
సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్ మాట్లాడుతూ.. 80సంవత్సరాల నుండి ఎగ్జిబిషన్ నడిపిస్తున్నామని, అకస్మాత్తుగా ఈ రోజు ఎగ్జిబిషన్ సొసైటీ పైన విచారణ చేస్తామని ఏసీబీ సిబ్బంది వచ్చారన్నారు. ఏసీబీ వాళ్లకు ఫిర్యాదు వచ్చిందని మాకు చెప్పి తనీఖీలు చేస్తున్నారుని, అయినా మా సొసైటీ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన అన్నారు. సొసైటీ కార్యకలాపాలు అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అకౌంట్స్ అన్ని ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తామని, సొసైటీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. కాగా మొట్టమొదటి సారిగా సొసైటీ మీద ఏసీబీ సోదాలు చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment