మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు, కాంగ్రెస్ యువనాయకుడైన విక్రమ్ గౌడ్.. గత జీహెచ్‌ఎంపీ ఎన్నికల్లో జాంబాగ్ డివిజన్ నుంచి పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్న ఆయన.. నియోజకవర్గంలోని ప్రజలకు తనపై సానుభూతి కలగలాలని భావించాడు. అదే సమయంలో విరోధులు తన జోలికి రాకుండా గట్టి షాక్ ఇవ్వాలనుకున్నాడు. రకరకాలుగా ఆలోచించి, చివరికి ‘అతడు’ ప్లాన్‌ను ఓకే చేసుకున్నాడు. అటుపై షూటర్లకోసం వెతుకులాడాడు. ఆ క్రమంలోనే విక్రమ్.. తనకు పరిచయస్తుడైన అనంతపురం జిల్లా కదిరి వాసి గోవిందరెడ్డిని సంప్రదించాడు. ఇంతకుముందు ఇలాంటివి చేసిఉండకపోవడంతో గోవింద్.. నందకుమార్ అనే వ్యక్తి(ఇతనికి 7 కేసుల్లో ప్రమేయం ఉంది)ని సంప్రదించాడు. రూ.50 లక్షలకు బేరం కుదిరింది. తుపాకుల కోసం కదిరికే చెందిన షేక్ అహ్మద్, బాబూజాన్‌లను సంప్రదించగా, వారు.. ఇండోర్(మధ్యప్రదేశ్)కు చెందిన రియాజ్ పేరును సూచించారు. వెంకటరమణ అనే మరో వ్యక్తిని వెంటపెట్టకుని గోవింద్, నందూ, అహ్మద్‌లు విమానంలో ముంబై మీదుగా ఇండోర్ వెళ్లి, రియాన్‌ను కలిసి 30 వేలు చెల్లించి, తుపాకిని కొన్నారు. మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు విక్రమ్‌గౌడ్ మానిటర్ చేస్తూనేవచ్చాడు. ఇండోర్ నుంచి తెప్పించిన తుపాకిని విక్రమ్ తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. నిత్యం గ్యాంగ్‌తో హత్యాయత్నం ఎలా చెయ్యాలనేది చర్చించేవాడు. ఈ క్రమంలోనే 26 తేది రాత్రి ఫిలింనగర్‌లోని విక్రమ్‌గౌడ్ ఇంటికి గ్యాంగ్ మొత్తం వచ్చింది. ఆ రోజే కాల్పులు జరగాల్సిఉంది. కానీ గ్యాంగ్‌లోని గోంవింద్, నందులు కాస్త తటపటాయించడంతో టాస్క్ వాయిదా పడింది. ఒక దశలో మేం చెయ్యలేమని వాళ్లు చేతులెత్తేశారు. దీతో విక్రమ్ ఖంగుతిన్నాడు. ఆ తర్వాత గౌస్ అహ్మద్ సలహా మేరకు ఇండోర్ నుంచి రియాజ్ ను రప్పించి, ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. స్వస్థలం పులివెందుల(కడప జిల్లా)కు వెళ్లిపోయిన నందకుమార్.. రియాజ్ వస్తున్న విషయం తెలుసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు.
Published Wed, Aug 2 2017 4:09 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement