హైదరాబాద్ : కాల్పుల డ్రామా ఘటనలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌తో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం విక్రమ్ గౌడ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మధ్యాహ‍్నం మూడు గంటలకు సుపారీ గ్యాంగ్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. కాగా కాల్పుల ఘటనలో సూత్రధారి విక్రమ్ గౌడేనని పోలీసులు తేల్చారు.
దీంతో ఆయనపై ఆయుధాల చట్టం కింద బుధవారం కేసు నమోదు చేశారు. A-1గా విక్రమ్ గౌడ్, A-2 నందు, A-3 అహ్మద్ ఖాన్‌ను చేర్చారు. మరోవైపు షేక్ పేట్ చెరువులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇవాళ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విక్రమ్ గౌడ్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.