mukhesh goud
-
ముఖేశ్ గౌడ్‌తో టీఆర్ఎస్ నేత భేటీ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్‌తో టీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు భేటీ అయ్యారు. ముఖేష్‌గౌడ్ నివాసంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మైనంపల్లి హన్మంతరావు, ముఖేష్‌తో ప్రత్యేకంగా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మైనంపల్లి హన్మంతరావు రహస్య చర్చలు జరిపారని తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన జాంబాగ్‌లోని ముఖేశ్ గౌడ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీ భవన్లో మాట్లాడుకుందాం రమ్మంటూ ఆహ్వానించి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ముఖేశ్ గౌడ్ ఇదివరకే మీడియాకు కూడా తెలిపారు. దాని తర్వాత మైనంపల్లి వచ్చి ప్రత్యేకంగా భేటీ కావడంతో ముఖేశ్ గౌడ్ పార్టీ మారతారనే చర్చ ఊపందుకుంది. కొంతకాలంగా గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా ముఖేశ్ గౌడ్, ఆయన కుమారుడు హాజరుకావడం లేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీకుమారులు గైర్హాజరు కావడంతో పార్టీ మారతారనే అనుమానం రెట్టింపైంది. -
డిశ్చార్జ్ అనంతరం విక్రమ్ గౌడ్ అరెస్ట్!
హైదరాబాద్ : కాల్పుల డ్రామా ఘటనలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌తో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం విక్రమ్ గౌడ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మధ్యాహ్నం మూడు గంటలకు సుపారీ గ్యాంగ్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. కాగా కాల్పుల ఘటనలో సూత్రధారి విక్రమ్ గౌడేనని పోలీసులు తేల్చారు. దీంతో ఆయనపై ఆయుధాల చట్టం కింద బుధవారం కేసు నమోదు చేశారు. A-1గా విక్రమ్ గౌడ్, A-2 నందు, A-3 అహ్మద్ ఖాన్‌ను చేర్చారు. మరోవైపు షేక్ పేట్ చెరువులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇవాళ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విక్రమ్ గౌడ్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. -
బాగుంది 'వరుస'...వీరుడెవ్వరో
వారంతా చుట్టాలు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తలో దిక్కు నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీలు వేరయినా వారంతా చుట్టాలే. వివిధ పార్టీల నుంచి టికెట్లు చేజిక్కించుకుని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎవరికి వారుగా జనంలోకి దూసుకు వెళుతున్నారు. మనవాళ్లలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారని..బంధువులంతా అంచనాలు వేసుకుంటున్నారు. మాజీ హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ చేవెళ్ల లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. హైదరాబాద్ జిల్లా గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ పోరులో నిలిచారు. ఇరువురిది బావ, బావమరిది వరుస. తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసిన వీరేందర్‌కు, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్‌కు తాజా ఎన్నికలు ప్రతిష్టాత్మకమయ్యాయి. అటు మామ-ఇటు అల్లుడు ఇక తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో ఇరు పార్టీల నేతలు ఉత్సాహంగా ఎన్నికల్లోకి దిగారు. ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగంలోకి దిగగా... హైదరాబాద్ జిల్లాలో అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంటు నుంచి గంగాపురం కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరిదీ మామ అల్లుడు వరస. ఒకరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా...మరొకరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటం విశేషం.