కాల్పుల డ్రామా ఘటనలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌తో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం విక్రమ్ గౌడ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మధ్యాహ‍్నం మూడు గంటలకు సుపారీ గ్యాంగ్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.