కాల్పుల డ్రామా ఆడి కటకటాల పాలైన మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను ఒక్కరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విక్రమ్‌గౌడ్‌తో పాటు చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న మరో ఐదుగురు నిందితులు ఎస్.నందకుమార్, షేక్ అహ్మద్, రయీస్ ఖాన్, కోకంటి బాబూజాన్, ఎ.గోవిందరెడ్డిలను మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.