మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్ గౌడ్‌కు అసలు లైసెన్స్ ఆయుధమే లేదని పోలీసులు చెబుతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి బయటి నుంచి దుండగులు వచ్చినట్లు ఆనవాళ్లు లభించలేదు.