mystery reveals
-
మంగళపర్తి శ్రీనివాస్ హత్య కేసులో వీడిన మిస్టరీ
-
‘రైల్ టికెట్’తో చిక్కిన హంతకులు: సంచలనం రేపిన ‘ఫాతిమా’ కేసు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ‘మానసికంగా కుంగిపోయిన యువతిని తిరిగి ఆరోగ్యవంతురాలిని చేస్తానని ఓ భూత వైద్యుడు నమ్మించి ఢిల్లీ రప్పించుకున్నాడు. తన వద్దకు చేరిన యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి సన్నిహితంగా మెలిగాడు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు మొదటి భార్య అడ్డు చెప్పడంతో వదిలించుకునేందుకు స్నేహితుడి సాయంతో నదిలోకి తోసి హత్యచేశాడు. అయితే తన కుమార్తె అదృశ్యమైందని యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, రైలు టికెట్ ఆధారంగా కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ కె.బాబూరావు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్టినగర్‌కు చెందిన నజీర్ అహ్మద్ తన కుమార్తె ఫాతిమా అనారోగ్యానికి గురవడంతో ఉత్తరప్రదేశ్ లోని షహరానాపూర్‌కు చెందిన భూతవైద్యుడు మహ్మద్ వాసిఫ్‌ను విజయవాడకు పిలిపించాడు. అతను పది రోజులు నగరంలో ఉండి ఫాతిమాకు భూతవైద్యం చేశాడు. అనంతరం అతను స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలం తరువాత ఫాతిమా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో నజీర్ అహ్మద్ తన కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుక్ చేసిన రైల్ టికెట్టే పట్టించింది.. ఫాతిమా అదృశ్యం కేసు పూర్వాపరాలను పరిశీలించిన కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి యువతి వినియోగించిన సెల్‌ఫోన్‌ను చివరి సారి ఎక్కడ వాడోరో గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ కాల్‌డేటా, మెసేజ్‌లను పరిశీలించారు. యువతి సెల్‌ఫోన్‌కు ఢిల్లీకి వెళ్లేందుకు రైల్వే టికెట్‌ను బుక్ చేసినట్లు మెసెజ్‌ను గుర్తించారు. ఆ టికెట్‌ను భూతవైద్యుడు మహ్మద్ వాసిఫ్ బుక్‌చేశాడని తేల్చారు. దీంతో ఫాతిమా కేసులో పురోగతి వచ్చింది. ఢిల్లీకి వెళ్లిన ఫాతిమాను మహ్మద్ వాసిఫ్, అతని స్నేహితుడు మహ్మద్ తయ్యద్ తమ స్వగ్రామైన షహరానాపూ ర్కు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాసిఫ్ కొద్ది రోజుల పాటు ఫాతిమాతో సన్నిహితంగా ఉండటంతోపాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ విషయం వాసిఫ్ భార్యకు తెలియడంతో ఆమె గొడవ చేసింది. దీంతో పెళ్లి కుదరదని వెంటనే ఢిల్లీ వెళ్లిపోవాలని వాసిఫ్ ఫాతిమాకు చెప్పాడు. ఆమె మాట వినకపోవడంతో బైక్‌పై మీర్జాపూర్ సమీపంలోని హత్నికుండ్ డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. స్నేహితుడు తయ్యద్ సాయంతో నదిలోకి తోసేశాడు. ఆమె మృతదేహం ఇటీవల బయటపడింది. రైల్ టికెట్ ఆధారంగా కేసు దర్యాప్తు కోసం షహరానాపూర్‌కు వెళ్లిన కొత్తపేట పోలీసులు కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించారు. హత్య కేసులో ప్రధాన నిందితులు మహ్మద్ వాసీఫ్(30), మహ్మద్ తయ్యద్(29) అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మీడియా సమావేశంలో వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
వీడిన సర్పంచ్ హత్య మిస్టరీ: పాతకక్షలతోనే దాడి
లింగాల : వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల సర్పంచ్ కణం చిన్న మునెప్ప హత్యకు పాత కక్షలే కారణమని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. లింగాల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మునెప్ప సర్పంచ్‌గా గెలుపొందడం జీర్ణించుకోలేక నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి వర్గీయులు హతమార్చారు. 1995లో గ్రామంలోని సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులు అదే గ్రామానికి చెందిన కాల్వ పుల్లన్నపై బాంబులు, తుపాకులు, కొడవళ్లతో దాడిచేసి చంపారు. దాడిలో పుల్లన్న, నలుగురు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కణం చిన్న మునెప్ప నిందితుడిగా ఉన్నాడు. తర్వాత 1995లో పులివెందుల మండలం రాయలాపురం బ్రిడ్జి సమీపంలో సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులే నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి బావ అంకిరెడ్డి మనోహర్‌రెడ్డిని హతమార్చారు. ఈ కేసులో కణం చిన్న మునెప్ప హస్తం ఉన్నట్లు బయటపడింది. అప్పటి నుంచి ఇతడిపై లక్ష్మీరెడ్డి వర్గీయులు కక్ష పెంచుకున్నారు. చిన్న మునెప్పను హతమార్చేందుకు పథకం వేశారు. గతనెల 27వ తేదీన పులివెందులలో నిర్వహించిన సర్పంచ్ శిక్షణా తరగతులకు కణం చిన్నమునెప్ప హాజరై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిగారి లక్ష్మీరెడ్డి, మరో 15 మంది ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఢీకొట్టారు. కిందపడిన చిన్న మునెప్పను కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గురువారం వెలిదండ్ల సమీపంలోని గొడ్డుమర్రి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షి సరిబాల వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహలను సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితులను శుక్రవారం పులివెందుల సివిల్ జడ్జి కోర్టుకు హాజరుపరచగా.. రిమాండ్‌కు పంపించారు. సమావేశంలో సీఐ రవీంద్రనాథరెడ్డి, ఎస్ఐ హృషికేశవరెడ్డి పాల్గొన్నారు. -
అక్క మొగుడే హంతకుడు..
అనంతపురం సెంట్రల్: అనంతపురం మండలం సోములదొడ్డి గ్రామంలో ఈ నెల 24న జరిగిన ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి అంజనప్రసాద్ (27) హత్య మిస్టరీ వీడింది. తమ కూతురును చేసుకోలేదని బావ (అక్క మొగుడు) బయన్న పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకట్రావ్ మీడియాకు వెల్లడించారు. హత్యకు కారణాలు ఇవి.. సోములదొడ్డిలో నివాసముంటున్న ఆంజనేయులుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెను నార్పల మండలం ఎం.తిమ్మపల్లికి చెందిన బయన్నకు ఇచ్చి వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితమే అత్తవారి ఇంటికి ఇల్లరికం వచ్చి స్థిరపడ్డారు. మూడునెలల క్రితం ఆంజనేయులు కుమారుడు అంజనప్రసాద్(27)కు కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన యువతితో వివాహమైంది. అంజనప్రసాద్ ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడంతో ఎలాగైనా తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి జరిపించాలని బయన్న గతంలో భావించాడు. రూ. 20 లక్షలైనా వరకట్నం ఇస్తా పెళ్లి చేసుకోవాలని పెద్దమనుషులతో ఒత్తిడి చేయించాడు. అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించానని, అందునా వయసు 12 సంవత్సరాలే ఉండడంతో పెళ్లికి నిరాకరించాడు. కొత్త జంటను చూసి ఈర్ష్య.. అంజనప్రసాద్కు మూడు నెలల క్రితం వివాహమైంది. నవదంపతులు ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా అన్యోన్యంగా ఉండేవారు. అంజనప్రసాద్ నగరంలో ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. నవ వధువు స్థానంలో తన కూతురు ఉంటే ఎంత బాగుండేదని, తన కూతురుకు అన్యాయం చేశాడని బయన్న ఈర‡్ష్య పెంచుకున్నాడు. దీంతో పాటు ఇంటి పక్కనే ఉండడంతో బయన్న రోజూ తాగి వచ్చి భార్యను కొడుతుండడంతో అంజనప్రసాద్ తీవ్రంగా మందలించాడు. తనపై దాడి చేసేకి వస్తావా అని కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. ఈ నెల 24 హత్యకు పథక రచన చేశాడు. హత్య చేశాడిలా.. ఈనెల 24న రాత్రి అంజనప్రసాద్ ఇంటికి మామిడికాయలు తీసుకొని వచ్చాడు. వీటిని కుటుంబసభ్యులందరూ కలిసి భోజనం చేసిన తర్వాత తిన్నారు. ఎవరిళ్లలో వారు నిద్రపోయారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బయన్న ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సెల్‌ఫోన్ అలారం పెట్టివ్వాలని అంజనప్రసాద్ను నిద్రలేపాడు. తలుపు తీయగానే పండ్లుకోసే కత్తితో గొంతుకోశాడు. తప్పించుకోవడానికి అంజనప్రసాద్ యత్నించిగా మచ్చుకత్తితో కోశాడు. ప్రాణం పోయిన తర్వాత నేరం నుంచి తప్పించుకోవడానికి చీరతో ఉరివేశాడు. అనంతరం రోజుమాదిరిగా హాస్టల్లో వంట చేసేందుకు వెళ్లిపోయాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎలాగైనా దొరికిపోతాననే ఉద్దేశంతో బయన్న వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాదీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకట్రావ్ వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ కృష్ణమోహన్, ఎస్ఐలు జగదీష్, రామ్‌ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
అయ్యో..అక్షర
రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 నెలల చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. తనను కొరికిందని ఆ చిన్నారిపై కోపం పెంచుకున్న మరో బాలిక ఈ ఘాతుకానికి పాల్పడింది. హత్య చేసిన బాలికను అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం జలవిహార్‌లో పనిచేసే అప్పల నాయుడు రాజుల కుమార్తె అక్షర గురువారం సాయంత్రం అదే ప్రాంతంలోని మురుగు నీటి సంప్‌లో శవమై తేలిన సంగతి విదితమే. అప్పలనాయుడు కుటుంబం జలవిహార్‌లో పనిచేస్తూ అక్కడే ఉండే రేకుల షెడ్డులో మిగతా కార్మికులతో కలిసి ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం అందరు పనిలో ఉండగా అక్షరతో పాటు మరో 11 ఏళ్ల బాలిక ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ బాలిక వెళ్లి అక్షరను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ అప్పలనాయుడుకు చెప్పింది. వెంటనే అన్ని ప్రాంతాల్లో వెదికి రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి చుట్టు పక్కల గాలించగా సంపులో అక్షర మృతదేహం కనిపించింది. సంపులో పడేసి...కిడ్నాప్‌గా డ్రామా ఫిర్యాదు అందగానే ఈ కేసును పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్షర కుటుంబ సభ్యులకు ఎవరైన శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి సీసీ కెమెరాలను పరిశీలించగా 11 ఏళ్ల బాలిక ఈ చిన్నారిని కొద్దిసేపు ఆడిస్తూ, ఎత్తుకుని ఉండటం కనిపించింది. ఆ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు కూడా ఎవరూ కనిపించ లేదు. తనపై ఎవరికి అనుమానం రాకుండా ఎవరో ఎత్తుకుని వెళ్లారని కట్టుకథ అల్లినట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ బాలిక అవసరం లేకున్నా పదేపదే అదే చెబుతుండటం, పొంతన లేకుండా మాటలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగి పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. అక్షర గతంలో ఒక మారు తన చేతిపై కొరికిందని, అందుకే అదే కోపంతో ఎత్తుకుని వెళ్లి సంపులో పడేసినట్లు బాలిక పోలీసులకు చెప్పింది. మాటలు కూడా రాని ఓ 16 నెలల చిన్నారి మృతి చెందితే పూర్తిగా లోకజ్ఞానం కూడా తెలియని బాలిక హంతకురాలు కావడం విచిత్రం. అనంతరం ఆ బాలికను శుక్రవారం అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. మృతి చెందిన చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వీడిన డాక్టర్ హత్య కేసు మిస్టరీ
కర్నూలు/డోన్: డోన్ పట్టణంలో సంచలనం కల్గించిన ప్రైవేట్ డాక్టర్ పోచా శ్రీకాంత్‌రెడ్డి (47) హత్య కేసు మిస్టరీ వీడింది. ఐదు రోజుల వ్యవధిలో డోన్ పోలీసులు కేసును ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన మురారి నరసింహ, భార్య నాగరత్న, కొడుకు మురారి చంద్రశేఖర్‌లను పక్కా సమాచారంతో కర్నూలు శివారులోని హైదరాబాదు జాతీయ రహదారి పంచలింగాల క్రాస్ వద్ద అదుపులోకి తీసుకుని ఎస్పీ గోపీనాథ్ జట్టి ఎదుట హాజరుపరిచారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఓఎస్డీ రవిప్రకాష్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. హత్యకు దారి తీసిన కారణాలు సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో మురారి నరసింహ రెండేళ్ల క్రితం రూ.9 లక్షలు, రూ.8 లక్షల చొప్పున తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో గుర్తు తెలియని మడ్డి సురేష్ పేరుతో పాలసీని సృష్టించి రెండింటికీ ఒక్కొక్క కంతు చొప్పున కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లోని బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్‌లో చెల్లించాడు. పాలసీ బాండ్లు వచ్చిన తర్వాత కొంత కాలానికి మడ్డి సురేష్ చనిపోయినట్లు రూ.2 వేలు ఇచ్చి డాక్టర్ శ్రీకాంత్రెడ్డిచేత డెత్ రిపోర్టు సృష్టించాడు. దాని ఆధారంగా డోన్ మున్సిపాలిటీలో మరణ ధ్రువీకరణ పత్రం పొంది రెండు పాలసీల ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ మొత్తం రూ.34 లక్షలు కంపెనీ చెల్లించాలని తన భార్య మురారి నాగరత్నంను మడ్డి సురేష్ భార్యగా చూపించి దరఖాస్తు పెట్టించాడు. అయితే మడ్డి సురేష్ ఫొటో స్థానంలో మురారి నరసింహదిగా ఇన్సూరెన్స్ ఇన్స్పెక్టర్ విచారణలో కనుగొని కంపెనీకి నివేదించడంతో పాలసీ డబ్బులు నిలిపివేశారు. తాను మడ్డి సురేష్ భార్యనేనని, అతను చనిపోయాడని, తనకు రావలసిన మెచ్యూరిటీ డబ్బు రూ.34 లక్షలను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని కర్నూలు వినియోగదారుల కోర్టులో ప్రధాన నిందితుడు కేసు వేయించాడు. పొరపాటున డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లువినియోగదారుల ఫోరంలో డాక్టర్ సాక్ష్యం నేరస్థుడు మురారి నరసింహకు రెండేళ్ల క్రితం పొరపాటున డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కర్నూలు వినియోగదారుల కోర్టులో డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి సాక్ష్యం చెప్పడంతో 2018 ఏప్రిల్ 16న కేసు వీగిపోయింది. మళ్లీ సివిల్ కోర్టులో అప్పీలు చేసుకుంటే డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని సాక్ష్యానికి రాకుండా చేయాలని నిందితుడు కుటుంబ సభ్యులతో కలసి పథకం వేశాడు. అందులో భాగంగా మురారి నరసింహ, అతని కొడుకు మురారి చంద్రశేఖర్ కలసి ఈనెల 10న సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక పేషంట్‌కు ట్రీట్మెంట్ ఇవ్వాలని నమ్మించి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని ఆటోలో తీసుకువెళ్లి డోన్ మండలం ఉడుములపాడు ఊరిబయట చెరువు కాలువ వద్ద వెనుక నుంచి రోకలి బండతో తలపై కొట్టి హత్య చేశారు. శవాన్ని కాలువలోకి ఈడ్చుకువెళ్లి ఎవరికీ కనిపించకుండా కంప చెట్ల కింద దాచిపెట్టారు. ముందు గా వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్‌పై రక్తపు మరకలు ఉన్నందున కొత్త క్యాన్ కోసం శవాన్ని అక్కడే విడిచిపెట్టి రోడ్డుపైకి రాగా, హైవే పెట్రోల్ వాహనం కనిపించడంతో తమ కోసమే గాలిస్తున్నారేమో అనుకుని అక్కడి నుంచి పారిపోయారు. బయటపడింది ఇలా.. ఆటోలో వెళ్లిన డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అంతటా గాలించినా శ్రీకాంత్‌రెడ్డి కనిపించలేదు. మరునాడు ఉదయం ఘటన వెలుగు చూడటంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శ్రీకాంత్‌రెడ్డిగా గుర్తించారు. ఈయన నంద్యాల మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి మనవడు. మృతుని భార్య ఉదయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఓఎస్డీ రవిప్రకాష్ స్పెషల్ ఆఫీసర్‌గా డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ నేపథ్యంలో ఐదు పోలీసు బృందాలు గాలించి ఐదు రోజుల వ్యవధిలో కేసు మిస్టరీని ఛేదించారు. నిందితులను త్వరగా అరెస్టు చేసినందుకు ఓఎస్డీ రవిప్రకాష్, డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ రాజగోపాల్ నాయుడు, టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేయడంలో దిట్ట మురారి నరసింహ పలు ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగిస్తూ పబ్బం గడుపుకునేవాడని వెల్లడైంది. బినామి పేర్లపై పాలసీలు ప్రారంభించాలని ఆయన తరచూ ఎల్ఐసీతో పాటు ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లపై ఒత్తిడి తెస్తుండేవాడని తెలిసింది. ఈ క్రమంలో తన సొంత అత్త నర్సమ్మ బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి రూ.8లక్షల ఇన్సూరెన్స్ మొత్తాన్ని కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే వృత్తిగా పెట్టుకున్న నరసింహ ఎప్పుడో చనిపోయిన మడ్డి సురేష్ పేరుపై బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి కంతులు చెల్లించారు. డాక్టర్ శ్రీకాంత్ హత్యకు ఒక రోజు ముందు కూడా పోస్టాఫీస్ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లి తన కుమారుడి పేరు మీదున్న రూ.17వేలను నరసింహ విత్‌డ్రా చేసినట్లు తెలిసింది. -
ఆ తాళి కట్టింది ఎవరో తెలిసిపోయింది..!
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): వచ్చేనెల పెళ్లి పీటలు ఎక్కవలసిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఒక్కో చిక్కుముడి వీడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడితో గడిపిన ఆమెకు ఓ ఫోన్ రావడం, దానిపై అతడు ఆమెను అనుమానించడంతో ఇద్దరి మధ్య జరిగిన వివాదం ప్రియురాలి ప్రాణాల మీదకు వచ్చింది. నగరం లోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన ప్రజ్ఞ వివాహం వచ్చేనెల 6న జరగా ల్సి ఉంది. ఇందుకు కుటుంబ సభ్యులు పనులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో పెళ్లి కూతురు ప్రజ్ఞ ఆత్మహత్యపై అనేక అనుమానాలకు తావిచ్చింది. బీటెక్, ఎంబీఏ చదివిన ప్రజ్ఞకు హైదరాబాద్‌లో నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ప్రజ్ఞతో ప్రేమలో ఉండగానే నవీన్‌కు మరొకరితో వివాహమైంది. అయినా ప్రజ్ఞ అతడిని మరవలేదు. అతడికి పెళ్లి అయినా అతనే కావాలని కో రుకుంది. కూతురు జీవితం బాగుండాలని కోరుకున్న తల్లిదండ్రులు, చెల్లెలు మొదటి శుభలేఖను వేంకటేశ్వరుడి పాదాల వద్ద పెట్టేందుకు తల్లిదండ్రులు తిరుపతికి వెళ్లారు. అదే రోజు ఇంట్లో ఎవరూ లేక ప్రజ్ఞ తన ప్రియుడు నవీన్‌ను నిజామాబాద్‌కు రావాలని చెప్పటంతో అత ను వచ్చాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, గదిలో అప్పటికప్పుడు ప సుపు కొమ్ముతో తాళి సిద్ధం చేసి అతడితో మెడలో కట్టించుకుంది. అనంతరం ప్రజ్ఞకు ఓ స్నేహితురాలు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆమెను పూర్తి పేరుతో కాకుండా నిక్ నేముతో పలకరించింది. ఫోన్ మాట్లాడాక నవీన్ ‘ఎవరూ ఫోన్ చేసిందని’ అని అడిగాడు. దాం తో ఆమె తన స్నేహితురాలు అని చెప్పింది. మరి మగ పేరుతో ఎందు కు పిలిచావని నవీన్ మరోసారి ప్రజ్ఞను అడగటంతో ఇద్దరి మధ్య స్వల్పంగా గొడవ జరిగింది. దాంతో నవీన్ హైదరాబాద్ వెళ్తాను అం టూ బయటకు వచ్చాడు. అతడి వెనుకే ఆమె కూడా వచ్చి నువ్వు తిరి గి రాకపోతే చనిపోతానంటూ చెప్పింది. అతను నీ ఇష్టం అనడంతో ఆమె కోపంతో తిరిగి ఇంటికి వచ్చి చున్నితో ఉరేసుకుంది. కాస్సేపటి కి నవీన్ ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇంటికి వెళ్లి కిటికీ నుంచి చూడగా బెడ్‌పై పడి ఉండటంతో అతను వెంటనే ప్రజ్ఞ చెల్లెలు కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు. అనంతరం నవీన్ అక్కడి నుంచి జారుకున్నాడు. మంగళవారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటన స్థలానికి వచ్చి కేసును చేధించినట్లు సమాచా రం. నవీన్‌ను శుక్రవారం రాత్రి పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలి పారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సంబంధిత వార్త : పెళ్లి కాకుండానే మెడలో పసుపు తాళి -
పెళ్లి చెడగొట్టాడనే..
అంబర్‌పేట: పట్టపగలు యువకుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. నిందితులను అరెస్టు చేసిన అంబర్‌పేట పోలీసులు సోమవారం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గోల్నాక, మారుతీనగర్‌కు చెం దిన కొప్పుల సతీష్‌గౌడ్(27) ఫైనాన్స్ వ్యాపా రం చేసేవాడు. ఏడేళ్ల క్రితం అతను గోల్నాకకు చెందిన హిమబిందును ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా సతీష్‌గౌడ్ భార్య హిమబిందు సోదరికి గత నెల 14న నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆమె అదృశ్యం కావడంతో వివాహం ఆగిపోయింది. ఇందుకు సతీష్ గౌడ్ కారణ మని బావించిన హిమబిందు సోదరుడు వెంకటేష్, కాచిగూడకు చెందిన తన చిన్నాన్నసురేష్తో కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 5న సతీష్‌గౌడ్‌ను దిల్‌సుఖ్‌నగర్‌కు పిలిపించారు. భార్యతో కలిసి వచ్చిన సతీష్‌గౌడ్‌ను మాట్లాడి పంపిస్తామని హిమబిందుకు చెప్పి ఆటోలో ఎక్కించుకొని మలక్‌పేట వైపు తీసుకెళ్లారు. మలక్‌పేట వద్ద ఆటోలోంచి దింపి స్కార్ఫియో కారులో ఎక్కిం చుకొని గోల్నాక వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో అతని మెడకు నైలాన్ తో ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం గోల్నాక చౌరస్తా వద్ద మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ కేసులో హతుడి బావమరిది, చిన్నమామతో పాటు హత్యకు సహకరించిన రాజు, సంతోష్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి స్కార్ఫియో వాహనం, నాలుగు సెల్ఫోన్లు, నైలాన్ తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
వీడిన మిస్టరీ
విజయనగరం టౌన్: జిల్లా కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు బొత్స మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పోలీసులు స్వల్ప కాలంలోనే కేసును ఛేదించారు. ఈ సంఘటనలో మోహన్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉపయోగించిన గన్ను తగరపువలస వద్దనున్న గోస్తనీ నదిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ జి. పాలరాజు సోమవారం విలేకరుల ముందుకు తీసుకువచ్చి వివరాలు వెల్లడించారు. గత నెల 24వ తేదీ రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ కార్యాలయంలో నమ్మి పైడిరాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై నిందితుడు బొత్స మోహన్ గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పరారై గన్ను గోస్తనీ నదిలో పడేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు మోహన్‌ను పట్టుకుంది. ఆయనతో పాటు తుపాకీ కొనుగోలుకు సహకరించిన కర్రోతు వెంకటరమణమూర్తి అలియాస్ రమేష్‌ను, సంఘటనా స్థలంలో కాల్పులు జరిపినప్పుడు కాపలాదారుగా వ్యవహరించడంతో పాటు కాల్పుల తర్వాత మోహన్‌ను నేరస్థలం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆశాన వెంకటరమణను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి రంగు సురేష్‌తో పాటు ఒడిశాకు చెందిన మరొకరు పరారీలో ఉన్నారు. కాల్పులకు కారణాలివే.. రియల్టర్ నమ్మి అప్పలరాజు, అతని మామయ్య ఉల్లంకుల శ్రీనివాసరావు కొన్నేళ్లుగా పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా నిందితుడు మోహన్ నుంచి రూ.16 లక్షలను 2014లో అడ్వాన్స్‌గా తీసుకున్నారు. అందుకు ప్రతిగా మండలంలోని వీటీ అగ్రహారంలో 55 చదరపు గజాల స్థలాన్ని గాని.. లేనిపక్షంలో ఏడాదిలో మోహన్ ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము (రూ.32 లక్షలు) ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అప్పలరాజు ఏడాదిలో అటు సొమ్ము ఇవ్వడంలో గాని, ఇటు స్థలం రిజిస్ట్రేషన్ చేయడంలో గాని విఫలమవ్వడంతో అప్పలరాజు, మోహన్ మధ్య అంతరం ఏర్పడింది. దీంతో ఇరువురి మధ్య ఎప్పటికప్పుడు వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మోహన్ ఈ విషయాన్ని కొంతమంది పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లడంతో గుండాలపేటలో ఉన్న 650 చదరపు గజాల స్థలాన్ని మోహన్ పేరుమీద అప్పలరాజు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే హైవే రోడ్డు విస్తరణలో భాగంగా వంద గజాల స్థలం పోనుండడంతో మోహన్ నిరాశకు గురయ్యాడు. ఇందులో భాగంగా అప్పలరాజుపై అక్కసు పెంచుకున్నాడు. తనకు జరిగిన నష్టానికి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో కర్రోతు రమణమూర్తి అలియాస్ రమేష్ సహకారంతో రంగు రమేష్ ద్వారా తుపా కీ కొనుగోలు చేసే ప్రాం తాన్ని తెలుసుకుని ఒడిశా వాసి నుంచి తుపా కి, ఐదు రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేశా డు. పథకం ప్రకారం ఆశాన వెంకటరమణ సాయంతో బాధితుడు అప్పలరాజు ఆఫీస్‌కు వెళ్లి మోహ న్ ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. తుపాకీనీ తగరపు వలస గోస్తనీనదీలో పడేశాడు. గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలు, సెల్‌ఫోన్ వినియోగంపై పోలీసులు దృష్టి సారించి నిందితుడితో పాటు మరో ఇద్దరిని తగరపువలస పరిసర ప్రాంతా ల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇది లా ఉంటే బాధితుడు నమ్మి అప్పలరాజు విశాఖలో కేర్ ఆస్పత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సమావేశంలో ఏఎస్పీ వెంకటరమణ, ఓఎస్డీ విక్రాంత్‌పాటిల్, సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి, పట్టణ డీఎస్పీ ఏవీ రమణ, తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు రివార్డులు కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా పనిచేసిన వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్సైఐలు జీఏవీ రమణ, ఎ.నరేష్, కానిస్టేబుల్ డి.శ్రీనివాసరావు, సీసీఎస్ ఎస్సైలు సింహాచలంనాయుడు, రాజారావు, హెచ్‌సీ శంకరరావు, పి.జగన్మోహనరావు, కానిస్టేబుల్ నాయుడు, ప్రసాద్, రూరల్ ఎస్సై రామకృష్ణ, టూటౌన్ ఎస్సై వి.అశోక్ కుమార్, నెల్లిమర్ల ఎస్సై హెచ్. ఉపేం ద్ర, బొబ్బిలి ఎస్సై అమ్మినాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ, ఐటి కోర్ కానిస్టేబుల్ రవికుమార్, కానిస్టేబుల్ రమేష్, పూసపాటిరేగ మండలం బర్రిపేటకు చెందిన గజ ఈతగాళ్లు బర్రి దారయ్య, పైడిరాజు, గుంటి ఎరకయ్య, మరుపల్లి పారయ్య, సూరాడ చయ్య, ఆకుల రామాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రోత్సాహక, నగదు రివార్డులను అందజేశారు. -
వీడిన హత్య కేసు మిస్టరీ..!
ప్రొద్దుటూరు క్రైం : ఇటీవల పెద్దశెట్టిపల్లె గ్రామ పంట పొలాల్లో హత్యకు గురైన వ్యక్తి కేసును రూరల్ పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. సంబేపల్లి మండలానికి చెందిన కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 15న పెద్దశెట్టిపల్లె సమీపంలోని మైలవరం పంట కాలువలో అతన్ని చంపి, మృతదేహాన్ని కాల్చిన విషయం తెలిసిందే. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసరావుతో పాటు సీఐ ఓబులేసు, ఎస్ఐ చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో పోలీసు దర్యాప్తుకు కొంతమేర ఆటంకం కలిగింది. దీంతో ప్రొద్దుటూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో పోలీసులు విచారించారు. భర్త కనిపించలేదని మహిళ చెప్పడంతో.. సంబేపల్లి మండలానికి చెందిన కృష్ణమూర్తి దంపతులు ప్రొద్దుటూరులోని ప్రైవేట్ పాఠశాల, కళాశాలల హాస్టల్లో వంట మనుషులుగా పని చేస్తున్నారు. వంటకు కావాల్సిన కూరగాయలను మార్కెట్ నుంచి వీళ్లే తెచ్చుకునేవారు. శంకరాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మూడేళ్ల కిందట కళాశాలలో అటెండర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో అటెండర్ కృష్ణమూర్తి దంపతులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న కృష్ణమూర్తి హత్యకు గురయ్యాడు. శంకరాపురానికి చెందిన వ్యక్తే అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కృష్ణమూర్తి భార్య పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తునట్లు సమాచారం. ఆస్తి కోసం అతన్ని హత్య చేశారా లేక మరే ఇతర కారణాలతో చంపారా అనే విషయం తెలియాల్సి ఉంది. కృష్ణమూర్తి రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో ఆమె పలువురికి ఫోన్లు చేసి భర్త గురించి అడిగినట్లు సమాచారం. ఇలా పోలీసులకు తెలియడంతో ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా హత్య కేసు వివరాలు బహిర్గతం అయినట్లు తెలిసింది. -
వీడిన మహిళ హత్య మిస్టరీ
తిరువళ్లూరు: మహిళ హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. వెళ్లవేడు పోలీసులు కేసు విచారణలో పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ భవన కార్మికురాలిగా గుర్తించిన పోలీసులు గుర్తించారు. అనుమానం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని తిరుమణం గ్రామానికి సమీపంలోని నెమిలిచ్చేరి–వండలూరు హైవే బ్రిడ్జి వద్ద 3న తేదీన మహిళను దారుణంగా హత్య చేసి పడేసిన సంఘటన కలకలం సృష్టించించిన విషయం తెలిసిందే. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో హత్యాచారం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే హత్యకు గురైన మహిళ ఆచూకీ గుర్తించడంలో పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులకు క్లూ దొరకడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు : మహిళ హత్య కేసును వేగంగా ఛేదించాలన్న ఉద్దేశంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తును చేపట్టారు. తిరువళ్లూరు కాంచీపురం, చెన్నై, వేలూరు జిల్లాలో అదృశ్యమైన మహిళల వివరాలను సేకరించారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం చెన్నై ఎస్ఏ నగర్ వ్యాసార్పాడికి చెందిన మునస్వామి తన భార్య ఆదృశ్యమైందని కొడుంగయూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అక్కడి పోలీసుల సూచనల మేరకు వెళ్లవేడుకు వచ్చిన మునస్వామిని పోలీసులు తిరువళ్లూరు వైద్యశాలకు తీసుకొచ్చి మృతదేహాన్నీ చూపించారు. మృతదేహం తన భార్యదేనని తాïపీ పనుల కోసం 2వ తేదీన ఇంటి నుంచి వెళ్లి ఇంటికి రాలేదని పోలీసులకు వివరించారు. పోలీసులు మునస్వామి ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం పోలీసులు దర్యాప్తును ము మ్మరం చేశారు. శాంతలక్ష్మి సెల్‌ఫోన్ ఆధారంగా కాల్‌డేటాను తీసి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్ ప్లానే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా విక్రమ్ గౌడ్‌ను పోలీసులు చేర్చారు. దీంతోపాటు ఆయనపై నాలుగు అదనపు సెక్షన్లను కూడా చేర్చినట్లు వెల్లడించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదుపులో అనంతపురానికి చెందిన ముఠా ఉంది. పట్టుబడ్డ నిందితులను పోలీసులు బుధవారం కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. పలు అనుమానాలతో ప్రారంభమైన ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. విక్రమ్ గౌడ్ కావాలనే ఇలా చేయించినట్లు తెలిసింది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన ముఠాకు విక్రమ్ గౌడ్‌కు గతంలోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన డైరెక్షన్లోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాను మూడు నెలల కిందటే కట్ చేయించుకున్నారట. దాంతోపాటు కాల్పుల తర్వాత పోలీసులకు ఏం చెప్పాలనే విషయంలో కూడా ఆయన తన భార్యకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి సానుభూతిని సంపాధించుకునేందుకు విక్రమ్ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చేశారు. ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. రూ.50లక్షలు తమకు సుపారి ఇచ్చినట్లు విక్రమ్ గౌడ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం టాస్క్‌ఫోర్స్ సోదాల్లో ఒక పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క, విక్రమ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.