అంబర్‌పేట: పట్టపగలు యువకుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. నిందితులను అరెస్టు చేసిన అంబర్‌పేట పోలీసులు సోమవారం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గోల్నాక, మారుతీనగర్‌కు చెం దిన కొప్పుల సతీష్‌గౌడ్(27) ఫైనాన్స్ వ్యాపా రం చేసేవాడు. ఏడేళ్ల క్రితం అతను గోల్నాకకు చెందిన హిమబిందును ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా సతీష్‌గౌడ్ భార్య హిమబిందు సోదరికి గత నెల 14న నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆమె అదృశ్యం కావడంతో వివాహం ఆగిపోయింది. ఇందుకు సతీష్ గౌడ్ కారణ మని బావించిన హిమబిందు సోదరుడు వెంకటేష్, కాచిగూడకు చెందిన తన చిన్నాన్నసురేష్‌తో కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం ఈ నెల 5న సతీష్‌గౌడ్‌ను దిల్‌సుఖ్‌నగర్‌కు పిలిపించారు. భార్యతో కలిసి వచ్చిన సతీష్‌గౌడ్‌ను మాట్లాడి పంపిస్తామని హిమబిందుకు చెప్పి ఆటోలో ఎక్కించుకొని మలక్‌పేట వైపు తీసుకెళ్లారు. మలక్‌పేట వద్ద ఆటోలోంచి దింపి స్కార్ఫియో కారులో ఎక్కిం చుకొని గోల్నాక వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో అతని మెడకు నైలాన్ తో ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం గోల్నాక చౌరస్తా వద్ద మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ కేసులో హతుడి బావమరిది, చిన్నమామతో పాటు హత్యకు సహకరించిన రాజు, సంతోష్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి స్కార్ఫియో వాహనం, నాలుగు సెల్‌ఫోన్లు, నైలాన్ తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment