నేను స్వార్థపరురాలిని!
సామాజిక మాధ్యమాల ద్వారా ఏదో ఒక సంచలన సందేశాలను పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే సమంత... తాజాగా తన కెరీర్ గురించి, తన సినిమాల ఫలితాల గురించి ఆసక్తికరమైన మెసేజ్‌ని పోస్ట్ చేశారు. ‘‘నేను నటించిన కొన్ని సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. అప్పుడు నేను కృంగిపోలేదు. ఆ మాటకొస్తే... విజయాలను అందుకున్నప్పుడు పొంగిపోలేదు కూడా. నేను స్వార్థపరురాలిని. సినిమా జయాజయాలతో అస్సలు సంబంధాలు పెట్టుకోను. అవి పూర్తిగా నిర్మాతకు మాత్రమే చెందినవి అనేది నా అభిప్రాయం. సినిమాలో నేనెలా చేశాననే విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటాను. ఆ విధంగా చూస్తే... నా ఫ్లాప్ సినిమాలు కూడా నాకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. సో... నటిగా నాకు అపజయం ఇప్పటి వరకూ లేదు. ‘సమంత సరిగ్గా నటించలేదు’.. అనే మాట వినిపించినప్పుడు స్వచ్ఛందంగా సినిమాల నుంచి తప్పుకుంటా’’ అని పేర్కొన్నారు సమంత.