Rumours: Samantha Lip Lock Scene With Vijay Devarakonda In Kushi Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda-Samantha: విజయ్‌ దేవరకొండతో సమంత లిప్‌లాక్‌ సీన్‌ ?

Published Sat, May 21 2022 3:31 PM | Last Updated on Sat, May 21 2022 4:12 PM

Rumours: Samantha Lip Lock Scene With Vijay Devarakonda In Kushi - Sakshi

Rumours: Samantha Lip Lock Scene With Vijay Devarakonda In Kushi: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్‌ సమంత జంటంగా కలిసి నటిస్తున్న లవ్‌ స్టోరీ 'ఖుషి'. ప్రేమ కథా చిత్రాలకు మారుపేరైన శివ నిర్వాణ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌-సమంత కలిసి నటిస్తున్నాన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటెన్స్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్‌-సామ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్‌ చేయడంతోనే డైరెక్టర్‌ శివ నిర్వాణ ఈ సీన్స్‌ క్రియేట్‌ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. 

అంతేకాకుండా ఆ సన్నివేశాలకు ఉన్న డెప్త్‌ను అర్థం చేసుకున్న విజయ్‌-సమంత లిప్‌లాక్‌ సీన్లలో నటించేందుకు ఒప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఈ వార్తల్లో ఎంత నిజముందో డైరెక్టర్‌ క్లారిటీ ఇస్తే గానీ, మూవీ విడుదలయ్యాక కానీ చెప్పలేం. కాగా గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్‌ కశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌ స్టైలిష్‌గా కనిపించగా, సామ్‌ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా ఆకట్టుకుంది. 



చదవండి: టాలీవుడ్‌లో ఎన్టీఆర్, సమంత టాప్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement