
యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి హీరోయిన్ సమంత ఓ సీక్రెట్ బయటపెట్టింది. తొలుత నేను కూడా విజయ్ ని చూసి అలానే అనుకున్నానని.. కానీ అసలు నిజం తెలిసి షాకయ్యానని చెప్పింది. ఇంతకీ రౌడీ హీరో గురించి సామ్ ఏం చెప్పింది? అందులో అంత స్పెషాలిటీ ఏముంది?
విజయ్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'ఖుషి'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ సినిమాకు మజిలీ, నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తీశారు. మలయాళ సెన్సేషన్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించాడు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ ట్రెండ్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?)
ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న విజయ్-సమంత.. తాజాగా తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఇద్దరూ పలు ఆసక్తికర విషయాల్ని షేర్ చేశారు. విజయ్ క్యారెక్టర్ గురించి మాట్లాడిన సామ్.. 'విజయ్ ని చూసి చాలామంది ఏదేదో అనుకుంటారు. కానీ అతడికి ఒక్క చెడు అలవాటు కూడా లేదు. ఇది తెలిసి నేనే షాకయ్యాను' అని చెప్పింది.
ఈ క్రమంలోనే సమంత.. విజయ్ అలవాట‍్లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. సామ్ అన్నట్లు విజయ్ మాటతీరు, అతడి ప్రవర్తన చూస్తే.. ఎవరైనా సరే చెడు అలవాట్లు ఉంటాయేమోనని భ్రమపడతారు. ఇప్పుడు సమంతనే నేరుగా చెప్పడంతో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది.
(ఇదీ చదవండి: మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?)
Comments
Please login to add a commentAdd a comment