Do You Know Vijay Devarakonda Kushi Musical Concert Event Dress Price - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ డ్రస్.. అంత కాస్ట్ లీ!?

Published Wed, Aug 16 2023 4:33 PM | Last Updated on Wed, Aug 16 2023 5:02 PM

Vijay Devarakonda Kushi Event Dress Cost Details - Sakshi

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఏదో ఓ వైరల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాడు. కావాలని చేస్తాడో అలా జరుగుతుందో తెలీదు గానీ మీమర్స్‌కి స్టఫ్‌గా మారుతుంటాడు. ఇప్పుడు కూడా అలానే జరిగింది. హైదరాబాద్‌లో తాజాగా 'ఖుషి' సినిమా ప్రమోషన్‌లో భాగంగా మ్యూజిక్ కన్సెర్ట్ పేరుతో ఓ ఈవెంట్ చేశారు. ఇందులో మిగతా సందడంతా పక్కనబెడితే విజయ్ డ్రస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 

హిట్ ఇంపార్టెంట్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా 'ఖుషి'. అయితే 'లైగర్'తో విజయ్,  'శాకుంతలం'తో సమంత ఘోరమైన ఫ్లాప్స్ చూశారు. కాబట్టి 'ఖుషి' హిట్ అనేది వీళ్లకు చాలా ముఖ్యం. ఇప్పటివరకు వచ్చిన పాటలు, ట్రైలర్ అదీ చూస్తుంటే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇప్పుడే ఏ విషయమనేది డిసైడ్ కాలేం కాబట్టి సెప్టెంబరు 1 వరకు వెయిట్ చేయాల్సిందే.

(ఇదీ చదవండి: ఖుషి ఈవెంట్‌లో మీడియా, మహిళలపై దౌర్జన్యం)

అన్ని లక్షలా?
ఇకపోతే 'ఖుషి' మ్యూజిక్ కన్సర్ట్‌లో విజయ్ వైట్ అండ్ వైట్ డ్రస్‌లో కనిపించాడు. సమంతతో కలిసి లైవ్ ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. దీని గురించి కాస్తంత పక్కనబెడితే..  విజయ్ ధరించిన వైట్ కలర్ కోట్, పలోజా మోడల్ ప్యాంట్ డిఫరెంట్‌గా అనిపించింది. నెటిజన్స్ దీనిపై ఫన్నీగానే ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ఔట్‌ఫిట్ డిజైనర్ వేర్ అని, దీని ధర సుమారు రూ.2 లక్షలు అని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

'సఖి'తో పోలిక!
విజయ్-సమంత 'ఖుషి' సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే.. నెటిజన్స్ పలు సినిమాలతో దీనికి పోలికలు పెడుతున్నారు. హీరోయిన్ ఇంట్లో నుంచి రావడం, భార్యభర్తల మధ్య గొడవలు రావడం లాంటి సన్నివేశాలు మణిరత్నం 'సఖి'లో ఉన్నట్లు 'ఖుషి'లో ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. దీనిపై కూడా సినిమా చూస్తే గానీ ఓ క్లారిటీ రాదు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'జైలర్' కలెక్షన్స్.. రజనీ దెబ్బకు 'విక్రమ్' రికార్డ్ బ్రేక్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement