
మొన్నటివరకు రూ.10 కోట్లకు అటూఇటుగా పారితోషికం తీసుకున్న రౌడీ ఇప్పుడు ఈ రేంజ్‌లో రెట్టింపు డబ్బులు తీసుకోవడమేంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శివ నిర్వాణ కూడా ఇన్ని
రీల్ లైఫ్‌లో విజయ్ దేవరకొండ, సమంతల జోడీ చూసి ఫ్యాన్స్ ముచ్చటపడిపోతున్నారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ఖుషి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. మొన్నటి మ్యూజికల్ కన్సర్ట్‌లో విజయ్, సామ్‌ల లైవ్ పర్ఫామెన్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సినిమాలో వీరి జోడీ ఇంకెలా ఉండబోతుందో అని అప్పుడే కలలు కనేస్తున్నారు.
పాతిక కోట్లకు చేరువలో విజయ్
ఇకపోతే ఖుషి సినిమాకుగానూ చిత్రయూనిట్ తీసుకున్న పారితోషికం లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ దేవరకొండ రూ.23 కోట్లు, సమంత రూ.4.5 కోట్లు తీసుకుంటున్నారట! శివ నిర్వాణ ఏకంగా రూ.12 కోట్ల పైచిలుకు పుచ్చుకున్నాడట. జయరామ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ వంటి వారికి రూ.20-80 లక్షల మధ్య పారితోషికం ఇచ్చారట. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతా సరే కానీ విజయ్, శివ నిర్వాణల రెమ్యునరేషనే నమ్మేలా లేదంటున్నారు నెటిజన్లు.
రౌడీ హీరో పారితోషికం
మొన్నటివరకు రూ.10 కోట్లకు అటూఇటుగా పారితోషికం తీసుకున్న రౌడీ ఇప్పుడు ఏకంగా రెట్టింపు డబ్బులు తీసుకోవడమేంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శివ నిర్వాణ కూడా ఇన్ని కోట్లు తీసుకునే ఛాన్స్ లేదని కామెంట్లు చేస్తున్నారు. గత సినిమా ఫ్లాప్ అయినప్పుడు పారితోషికం ఎలా పెంచుతారని, వీళ్లకు అంత సీన్ లేదని సెటైర్లు వేస్తున్నారు. కాగా శాకుంతలంతో సమంత, లైగర్‌తో విజయ్, టక్ జగదీష్‌తో శివ నిర్వాణ ఫ్లాప్‌లు మూటగట్టుకున్నారు. ఈ ముగ్గురు ఆశలన్నీ ఇప్పుడు ఖుషి సినిమా మీదే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎటువంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి!
#Kushi Lead Remuneration#VijayDeverakonda 23crs+GST#Samantha 4.5crs+GST#ShivaNirvana 12crs+GST#KushiOnSep1st
— RR💥 (@rrking99) August 19, 2023