రిస్క్ చేస్తున్న 'ఖుషి'.. ఆ ఒక్కటి మాత్రం! | 'Kushi' Movie Runtime And Censor Details; Check Here - Sakshi
Sakshi News home page

Kushi Movie: 'ఖుషి' సినిమా సెన్సార్ పూర్తి.. కానీ!

Published Wed, Aug 23 2023 3:38 PM | Last Updated on Wed, Aug 23 2023 4:57 PM

Kushi Movie Duration And Censor Talk  - Sakshi

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' రిలీజ్‌కు సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబరు 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రాబోతుంది. పాటలతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విషయంలో.. టీమ్ రిస్క్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!)

టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్న సినిమా 'ఖుషి'. విజయ్, సమంత కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్ ఉంది. పాటలు, ఆ విజువల్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పొచ్చు. సెన్సార్‌లో టాక్ కూడా బాగానే వచ్చింది. దీంతో విజయ్-సమంత హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్ర నిడివి మాత్రం కాస్త ఎక్కువున్నట్లు అనిపిస్తుంది. 

సాధారణంగా లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ స్టోరీలతో తీసే సినిమాలు సింపుల్ అండ్ షార్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ 'ఖుషి' నిడివి మాత్రం 165 నిమిషాలు. కథలో ప్రేక్షకులు లీనమైతే ఈ లెంగ్త్ పెద్ద సమస్య కాకపోవచ్చు. 

(ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్‌ వల్లే భోళా శంకర్‌ ఫ్లాప్‌: 'బేబి' నిర్మాత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement