Censor Board certificate
-
కంగన ‘ఎమర్జెన్సీ’కి దక్కని ఊరట
ముంబై: కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’సినిమాకు విడుదల కష్టాలు తప్పట్లేవు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ఆరో తేదీన సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఇంతవరకు సినిమా సర్టిఫికేషన్ పూర్తవలేదు. తక్షణం సర్టిఫై చేయాల్సిందిగా సెన్సార్ బోర్డును ఆదేశించలేమని జస్టిస్ బీపీ కోలాబవాలా, జస్టిస్ ఫిర్దోశ్ పూనీవాలాల బాంబే హైకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది. సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఆదేశించాలంటూ సినిమా నిర్మాణసంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. సినిమాలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. దీంతో సినిమాకు సరి్టఫికేట్ ఇచ్చే ముందు వీరి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ అంశాన్ని బుధవారం బాంబే హైకోర్టు ప్రస్తావించింది. ‘సర్టిఫికేషన్ అంశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచి్చంది. ఆ ఉత్తర్వులు లేకపోయి ఉంటే ఈరోజే సరి్టఫై చేయాలని సీబీఎఫ్‌సీని ఆదేశించేవాళ్లం. ఈ దశలో మేం కలుగజేసుకోవడం సబబు కాదు. అందుకే తక్షణం సర్టిఫై చేయాలని ఆదేశించలేం. అయితే సినిమాపై వస్తున్న అభ్యంతరాలపై ఈనెల 18లోపు సీబీఎఫ్సీ నిర్ణయం తీసుకోవాలి’అని హైకోర్టు సూచించింది. సినిమాకు ఎలాంటి ఊరట లభించకపోవడంతో కంగన అసహనంతో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్‌బోర్డు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్వయంగా బాంబే హైకోర్టే చెబుతోంది’అని కంగన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
'వ్యూహం' రెండో ట్రైలర్ పీక్స్.. రసగుల్లా కంటే చంద్రబాబే ఇష్టం: వర్మ
టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో ఉన్నది ఉన్నట్లు చూపించేదే వ్యూహం సినిమా అని ఆర్జీవీ తెలిపారు. నవంబరు 10న విడుదల కావాల్సిన ఈ సినిమాపై నారా లోకేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఆ సమయంలో బ్రేక్ పడింది. తర్వాత సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి మళ్లీ సినిమాను పంపించడం ఆపై రామ్ గోపాల్ వర్మకు అనుకూలంగా సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడం వంటివి జరగడంతో.. డిసెంబర్ 29న వ్యూహం సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో వ్యూహం సినిమా నుంచి మరో ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. మొదటి ట్రైలర్ మాదిరే రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఈ క్రమంలో ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఇలా వ్యాఖ్యానించారు. 'అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ వ్యూహం సినిమాను ఆపలేరు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్‌గా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఎలాంటి మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారని నన్ను అడగొద్దు. మళ్లీ చెబుతున్న ఏపీ సీఎం జగన్‌తో నాకు పరిచయం లేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది..? అనేది ఈ వ్యూహం చిత్రంలో చూపించాము. ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాము. గతంలో బయట వాళ్లు మైక్స్ దగ్గర ఏమీ చెప్పారో.. అది మాత్రమే ప్రజలకు తెలుసు కానీ వాళ్ల ఇంట్లో పర్సనల్‌గా చర్చించే విషయాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ మాత్రమే.. నేను ఏమీ చూపించానో అనేది తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది. సెన్సార్ సర్టిఫికెట్తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఎలా వచ్చిందని చెబితే మమ్మల్ని జైలుకు పంపిస్తారు. దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించడం వల్ల వ్యూహం సినిమాకు సెన్సార్ చేశారు. వ్యూహం సినిమా ఒక పొలికల్ డ్రామా... వైఎస్సార్ చనిపోయిన దగ్గరి నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుంది. రసగుల్లా కంటే కూడా చంద్రబాబు అంటేనే నాకు ఇష్టం.' అని ఆర్జీవీ అన్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
వ్యూహం సినిమాను అడ్డుకుంటే కోర్టుకు వెళ్తా: రామ్‌గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. కానీ వ్యూహం అనుకున్న తేదీకి రావడం లేదని తెలుస్తోంది. వ్యూహం సినిమా రిలీజ్‌ను ఆపేయాలని సెన్సార్ బోర్డ్ నిర్ణయించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై రామ్‌గోపాల్ వర్మ స్పందించాడు. సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం ఆయన మాట్లాడుతూ.. 'ఎల్లో మీడియా బ్యాచ్ సినిమా సెన్సార్ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫై చేస్తుందే తప్ప సినిమాను ఆపలేదు. వ్యూహం చిత్రాన్ని ఆపడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తున్నా.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఇక్కడ సెన్సార్ వాళ్ళు రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారు. రివైజింగ్ కమిటీ చెప్పింది చేస్తాం. అప్పటివరకు సినిమా రిలీజ్‌ను మేమే వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం. కోర్టుకు వెళ్తా.. టీడీపీ నాయకుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారనే వార్త విన్నాను. కానీ, దాని గురించి పూర్తిగా తెలియదు. రివైజింగ్ కమిటీ కూడా అనుకూలంగా లేకపోతే ఉడ్తా పంజాబ్, పద్మావతి సినిమాలు లాగా కోర్టుకు వెళ్తాను. సెన్సార్ అవుడేటెడ్ సిస్టమ్ అని నా అభిప్రాయం. అసలు వ్యూహం సినిమాలో నా వ్యూహమంటూ ఏమీ లేదు. ప్రముఖ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరణించినప్పుడు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. అందులో నాకు తెలిసినవి నేను వ్యూహం సినిమా ద్వారా చెప్తున్నాను. నేను నమ్మిన దాన్ని సినిమా తీస్తున్నాను' అని రామ్‌గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య ఇక లేరు -
రిస్క్ చేస్తున్న 'ఖుషి'.. ఆ ఒక్కటి మాత్రం!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' రిలీజ్‌కు సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబరు 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రాబోతుంది. పాటలతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విషయంలో.. టీమ్ రిస్క్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!) టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌తో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్న సినిమా 'ఖుషి'. విజయ్, సమంత కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్ ఉంది. పాటలు, ఆ విజువల్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పొచ్చు. సెన్సార్‌లో టాక్ కూడా బాగానే వచ్చింది. దీంతో విజయ్-సమంత హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్ర నిడివి మాత్రం కాస్త ఎక్కువున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ స్టోరీలతో తీసే సినిమాలు సింపుల్ అండ్ షార్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ 'ఖుషి' నిడివి మాత్రం 165 నిమిషాలు. కథలో ప్రేక్షకులు లీనమైతే ఈ లెంగ్త్ పెద్ద సమస్య కాకపోవచ్చు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ వల్లే భోళా శంకర్ ఫ్లాప్: 'బేబి' నిర్మాత) -
'ఓపెన్‌హైమర్' సినిమాలో ఆ సీన్ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ
హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్' భారతదేశంలో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ ఓపెనింగ్‌ను సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జులై 21 న విడుదలైంది. 'అణుబాంబు పితామహుడు' అని పిలువబడే వ్యక్తి J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ బయోపిక్ కావడంతో భారీ అంచనాలతోనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో నోలన్ క్రియేటివిటీ అద్భుతంగా ఉన్నా.. భారతీయుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. (ఇదీ చదవండి: 'కల్కి' టైటిల్ రిలీజ్‌కు ఎందుకు రాలేదంటే: అమితాబ్) భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అప్పట్లో చెప్పారు. ఈ వ్యాఖ్యాన్ని కూడా సినిమాలో చూపించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఒక సన్నివేశం మాత్రం కొంతమంది భారతీయ సినీ ప్రేక్షకులను కలవరపరిచింది. అశ్లీల సన్నివేశంలో భగవద్గీత ప్రస్తావన తీసుకురావడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. అంతేకాకుండా సినిమాను నిషేధించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమాచార ప్రసార (ఐబి) మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ సీన్‌కు అభ్యంతరం చెప్పకుండా ఎలా సెన్సార్ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. దీంతో తాజాగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై స్పందించింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించాలని 'ఓపెన్‌హైమర్' టీమ్‌ను కోరింది. దీంతో నేటి నుంచి ఆ సన్నివేశాన్ని తొలిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. -
‘లైగర్’ సెన్సార్ పూర్తి? థియేట్రికల్ రన్‌టైం ఎంతంటే..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిచన ఈ చిత్రం ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంత చేసిన చిత్ర బృందం ఇప్పటికే మూవీ టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా వాటికి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ వర్క్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్ ఫొటోతో రచ్చ సెన్సార్ బోర్డ్ ప్రకారం లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, పాటలతోపాటు.. మూవీలోని మరిన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనున్నాయంటున్నారు. బాక్సర్‌గా విజయ్ అదరగొట్టాడని, అతడి మాస్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా కాకుండ ఉండలేరట. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట. అంతేకాదు ఇందులోని ప్రతి పాత్ర ఆడియన్స్‌ను మెప్పిస్తుందంటున్నారు. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు లైగర్ టీంను ప్రశంసించినట్లు తెలుస్తోంది. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? మొత్తానికి లైగర్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ఆగస్ట్ 25న బాక్సాఫీసుపై దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మరోవైపు ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌కు పరిచయకాబోతున్నాడు. ఇప్పటికే నార్త్‌లో విజయ్‌కి వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీనికి ఇటీవల ముంబైలో మాల్ జరిగిన మూవీ ఈవెంట్యే ఉదాహరణ. మరి ఈ మూవీతో విజయ్ నార్త్ ఆడియన్స్ ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి. -
ఓటీటీకి కూడా సెన్సార్
సాధారణంగా సినిమాలైతే సెన్సార్ అవ్వకపోతే విడుదల చేయలేరు. సినిమా తయారైన తర్వాత ఎవరెవరు ఆ సినిమా వీక్షించవచ్చో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, జీ5 మొదలైనవి) ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్ లేదు. కానీ ఇకనుంచి ఓటీటీ కంటెంట్‌కి కూడా కత్తెర తప్పదని సమాచార మరియు ప్రసారశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక పై ఆన్లైన్లో ప్రసారమయ్యే కంటెంట్ కూడా ప్రభుత్వం గమనిస్తుంటుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని డిజిటల్ మాధ్యమాల్లో సినిమా, సిరీస్‌లు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్న పలువురు దర్శక–నిర్మాతలు వ్యతిరేకించారు. -
‘ఈ టెక్నిక్ ఫాలో అయ్యుంటే సినిమా రిలీజయ్యేది’
సాక్షి, చెన్నై : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంపై సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. వివాదాస్పద టైటిల్ వలన సినిమా రిలీజవదని, పబ్లిసిటీ హైప్ వరకు మాత్రమే ఉపయోగపడుతుందని వివరించారు. కులాల పేరుతో టైటిల్స్ ఉంటే పర్మిషన్ ఇవ్వరని అందుకు ఇటీవల వచ్చిన వాల్మీకి చిత్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆ సినిమాలాగా రిలీజ్‌కి ఒక్కరోజు ముందు టైటిల్ మారిస్తే సరిపోయేదని సూచించారు. సెన్సార్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం సినిమాపై కోర్టులో కేసు ఉంటే సర్టిఫికెట్ ఇవ్వరని వెల్లడించారు. ఈ నిబంధనను చిరంజీవి సైరా నుంచి అధికారులు ఖచ్చితంగా పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కాకుండా, సినిమాలో కేఏ పాల్ పాత్రలేదని వర్మ కోర్టులో ఒక్క డిక్లరేషన్ ఇచ్చి ఉంటే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం, సైరా సినిమాలకు తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేదాకా ఆగి ఉంటే ఆ తర్వాత సినిమా విడుదలను ఆపే అధికారం భద్రత పేరుతో ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందన్నారు. సినిమా రిలీజయ్యాక అందులోని సన్నివేశాలు ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే కేసు పెడతారని, లేదంటే పరువు నష్టం దావా వేస్తారని తెలిపారు. ఇప్పుడు కేఏపాల్ కేసు కోర్టులో ఉంది కాబట్టి తుదితీర్పు వచ్చేదాక, సెన్సార్ వాళ్లు సినిమా చూసినా కూడా సర్టిఫికెట్‌ను హోల్డ్‌లో పెడతారని వివరించారు. ఇలా కాకుండా సినిమా విడుదలకు ముందే నాలుగు రోజులు టీవీ డిబేట్లలో సందడి చేయడం అనేది వాళ్లకు టీఆర్పీ రేటు పెంచడానికే ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు ఈ సినిమా విడుదల కాకూడదని సినీ రంగంలోని కొందరు పెద్దలు పనిచేస్తున్నారని ఆరోపించారు. వీటి ముందు కేఏపాల్ సమస్య చాలా చిన్నదని పేర్కొన్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘2.ఓ’
ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో 2.ఓ ఫీవర్ కనిపిస్తోంది. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ లాంటి టాప్ స్టార్స్‌తో శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా 2.ఓ తెలుగు వర్షన్ సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. రజనీ సరసన బిట్రీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ఆఫీసర్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆఫీసర్. చాలా కాలం తరువాత కింగ్ నాగార్జున, వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఆఫీసర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా వర్మ కూడా జాగ్రత్త సినిమా చేశానని చెపుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కర్ణాటకు చెందిన ఐపీఎస్ అధికారి కేఎం ప్రసన్న జీవితం ఆధారంగా హీరో పాత్రను తీర్చి దిద్దిన ఈ సినిమాలో నాగార్జున పోలీస్ అధికారిగా నటిస్తుండగా మైరా సరీన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
త్వరలో జపాన్‌లో ‘బాహుబలి 2’ రిలీజ్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సత్తా చాటిన ఈ భారీ చిత్రం త్వరలో ఓవర్ సీస్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీ వసూళ్లు సాధించగా ముందు ముందు మరిన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్రయూనిట్. ఈ నెల 29న బాహుబలి 2 జపాన్ లో భారీగా రిలీజ్ అవుతోంది. జపనీస్ భాషలో డబ్ చేసి భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు జపాన్ సెన్సార్ బోర్డ్ ‘జీ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మన సెన్సార్ బోర్డ్ అందించే క్లీన్ యు సర్టిఫికేట్ కు ఇది సమానం. త్వరలోనే కొరియా, చైనా తో పాటు ఇతర ఆసియా దేశాల్లో బాహుబలి 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
'ఏ' సర్టిఫికెట్తో వస్తున్న జయిక్కిర కుదిర
సాక్షి, చెన్నై: లవ్, కామెడీ, గ్లామర్ ఈ మూడు అంశాలు ఉంటేనే నేటి యువతకు చిత్రాలు నచ్చుతున్నాయి. అలాంటి అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం జయిక్కిర కుదిరై అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శక్తి ఎన్.చిదంబరం. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సినిమాప్యారడైజ్, చరణ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొంత గ్యాప్ తరువాత జీవన్ హీరోగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా డింపుల్ శోబాడే, సాక్షీఅగర్వాల్, అశ్వని ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జయప్రకాశ్, తలైవాసల్ విజయ్, కోవైసరళ, రవిమరియ, సింగంపులి, చిత్రాలక్ష్మణ్, లీవింగ్‌స్టన్, రమేశ్‌ఖన్నా, మదన్ బాబు, యోగిబాబు, భడవాగోపి, టీపీ.గజేంద్రన్, పాండు, ఏఎల్.అళగప్పన్, రోబోశంకర్, ఇమాన్ అన్నాచ్చి, దీప, రామానుజం, వైయాపురి, ఆదవన్ నటిస్తున్నారు. అంజి సంగీతం, కేఆర్.కవిన్ శివ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు శక్తి.ఎన్.చిదంబరం తెలుపుతూ జయిక్కిర కుదిరై చిత్రం జనరంజకమైన అంశాలతో ఆరంభం నుంచి, చివరి వరకూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుందన్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. -
సెన్సార్ బోర్డ్ తీరు బాధాకరం
‘‘యువతరాన్ని మేల్కొలిపేలా.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ క్లీన్ ఎంటర్టైనర్గా ‘శరణం గచ్ఛామి‘ సినిమా తీశాం. అయితే, సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. వారి తీరు ఆవేదనను కలిగిస్తోంది’’ అన్నారు చిత్ర దర్శక– నిర్మాతలు ప్రేమ్‌రాజ్, బొమ్మకు మురళి. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అశ్లీలం, హింసను ప్రేరేపిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న సినిమాలకు ‘క్లీన్ సర్టిఫికెట్స్’ జారీ చేసే సెన్సార్ బోర్డ్ సభ్యులు, క్లీన్‌గా తెరకెక్కిన మా చిత్రానికి ఎందుకు ఇవ్వడం లేదో తెలియడంలేదు. సరైన కారణాలు చూపకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లమనడం బాధాకరం. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణి, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళతాం’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు.