సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. కానీ వ్యూహం అనుకున్న తేదీకి రావడం లేదని తెలుస్తోంది. వ్యూహం సినిమా రిలీజ్‌ను ఆపేయాలని సెన్సార్ బోర్డ్ నిర్ణయించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై రామ్‌గోపాల్ వర్మ స్పందించాడు.
సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం
ఆయన మాట్లాడుతూ.. 'ఎల్లో మీడియా బ్యాచ్ సినిమా సెన్సార్ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫై చేస్తుందే తప్ప సినిమాను ఆపలేదు. వ్యూహం చిత్రాన్ని ఆపడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తున్నా.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఇక్కడ సెన్సార్ వాళ్ళు రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారు. రివైజింగ్ కమిటీ చెప్పింది చేస్తాం. అప్పటివరకు సినిమా రిలీజ్‌ను మేమే వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం.
కోర్టుకు వెళ్తా..
టీడీపీ నాయకుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారనే వార్త విన్నాను. కానీ, దాని గురించి పూర్తిగా తెలియదు. రివైజింగ్ కమిటీ కూడా అనుకూలంగా లేకపోతే ఉడ్తా పంజాబ్, పద్మావతి సినిమాలు లాగా కోర్టుకు వెళ్తాను. సెన్సార్ అవుడేటెడ్ సిస్టమ్ అని నా అభిప్రాయం. అసలు వ్యూహం సినిమాలో నా వ్యూహమంటూ ఏమీ లేదు. ప్రముఖ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరణించినప్పుడు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. అందులో నాకు తెలిసినవి నేను వ్యూహం సినిమా ద్వారా చెప్తున్నాను. నేను నమ్మిన దాన్ని సినిమా తీస్తున్నాను' అని రామ్‌గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.
చదవండి: తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య ఇక లేరు
Comments
Please login to add a commentAdd a comment