Ram Gopal Varma Vyooham Movie Poster Released - Sakshi
Sakshi News home page

Vyuham Movie: వ్యూహం పోస్టర్‌ రిలీజ్‌.. వర్మ ప్రతిభ చూసి ఆశ్చర్యపోతున్నానన్న నిర్మాత

Published Mon, Jul 17 2023 6:12 PM | Last Updated on Mon, Jul 17 2023 6:22 PM

Ram Gopal Varma Vyuham Movie Intense Poster Released - Sakshi

కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసామాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’. ఆ నాయకుడు మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ ఇంటెన్స్‌ పోస్టర్‌ రిలీజైంది. టెక్నికల్‌గా తమ పోస్టర్లతో కథను చెప్పి ట్రెండ్‌ చేయగల పోస్టర్‌ డిజైనర్స్‌.. అనిల్‌ అండ్‌ భాను అని సెన్సేషనల్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన ట్విటర్‌ ద్వారా తెలియచేశారు.

వైఎస్‌. జగన్‌ పాత్రను పోషించిన అజ్మల్‌ తనపై జరిగిన కుట్రలకి ఎలా స్పందిస్తున్నారో తెలిపే పోస్టర్‌ను వర్మ విడుదల చేశారు. ఎంతో వ్యూహాత్మకంగా ‘వ్యూహం’ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కిస్తున్న దర్శకుడు ఆర్జీవి ప్రతిభను చూసి ఆశ్యర్యపోతున్నానన్నారు చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌. ‘వ్యూహం’ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయిందని నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తామన్నారు.

రామదూత క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు అన్న ఒకే ఒక్క డైలాగ్‌తో వచ్చిన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసేదిగా ఉంది. ఈ చిత్రంలో వైఎస్‌.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి – సుజీష్‌ రాజేంద్రన్, ఎడిటర్‌– మనీష్‌ ఠాకూర్‌.

చదవండి: ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement